రాజమౌళి దర్శకత్వంలో చేయాలనుందట..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళితో పంచేయాలని ఏ హీరోయిన్ కి మాత్రం ఉండదు చెప్పండి.రాజమౌళి సినిమాలో ఈగ హీరో అయినా సమంత లాంటి ముద్దుగుమ్మే నటించింది.

 Is Rajamouli Give A Chance To Niveda Thomas..?-TeluguStop.com

ఇప్పుడు అవకాశం వస్తే తనకు జక్కన్న దర్శకత్వంలో నటించాలని ఉందంటుంది జెంటిల్ మన్ తో తెలుగు ఎంట్రీ ఇచ్చిన మలయాళ భామ నివేదా థామస్.రీసెంట్ గా రిలీజ్ అయిన నాని జెంటిల్ మన్ లో నానితో పోటీ పడి నటించి ప్రశంసలు అందుకున్న నివేదా థామస్ తనకు అవకాశం వస్తే రాజమౌళి సినిమా చేస్తా అంటుంది.

మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి సినిమాలు చేస్తున్న నివేదా తెలుగు మార్కెట్ పై కన్నేసింది.క్యారక్టర్ ఎలాంటిదైనా సరే దాన్ని దర్శకుడు అనుకున్న విధంగా చేసి చూపించాలన్నదే తన లక్ష్యమని.

ఎటువంటి చాలెంజింగ్ రోల్స్ అయినా చేస్తానని అంటుంది ఈ భామ.ఇక తన డ్రీం రోల్స్ గా బెగ్గర్, ఇన్నోసెంట్ గాళ్ ఇంకా కుదిరితే సైకోగా కూడా చేస్తా అంటుంది నివేదా.

ప్రస్తుతం ఎంట్రీ ఇస్తున్న ప్రతి బ్యూటీ అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటే తాను మాత్రం ఎన్నటికి గ్లామర్ షో చేసేది లేదు అంటూ తెగేసి చెబుతుంది మలయాళ ముద్దుగుమ్మ.ఇక నాని జెంటిల్ మన్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనసు గెలిచిన ఈ చిన్నది ఏదో ఒకరోజు తాను కోరుకున్న రాజమౌళి కూడా పిలిచి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.

సో తెలుగు తెర మీద అభినయ తారగా వెలుగొందడానికి వచ్చిన నటీమణి నివేదాకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube