నాచురల్ స్టార్ నాని సినిమా తీస్తే హిట్ అన్న పరిస్థితి కనబడుతుంది.వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న నాని రీసెంట్ గా జెంటిల్ మన్ సక్సెస్ తో మరో హ్యాట్రిక్ కు నాంధి పలికాడు.
ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్లో నాని తన సక్సెస్ జోష్ ను పంచుకున్నాడు.మోహనకృష్ణ గారి మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేశానని.
చాలామంది చాలా రకాలుగా భయపెట్టే ప్రయత్నం చేసినా అవేమి పట్టించుకోకుండా సినిమా చేశానని అన్నాడు నాని.
ఇక జెంటిల్ మన్ సినిమాలో డబుల్ రోల్ కిక్ ఇచ్చిందని చెబుతూ ఈ సినిమా కన్నా తాను జెండా పై కపిరాజు సినిమాకు డబుల్ రోల్ కోసం ఎక్కువ కష్టపడ్డాను కాని అది పోయింది ఈ సినిమా హిట్ అయ్యింది అన్నారు.
ఆ సినిమాకు పడ్డ కష్టం కన్నా జెంటిల్ మన్ కు చాలా తక్కువ పడ్డానని.ఫైనల్ గా ఈ సినిమా సక్సెస్ అవడం చాలా సంతోషం అన్నారు.
సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూకు థాంక్స్ చెప్పిన నాని మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ గారి వల్లే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది అన్నారు.
హీరో వచ్చినప్పుడు కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు అరుపులు కేకలు వినిపించాయని అన్నారు.
సో మొత్తానికి నాని ఎకౌంట్ లో మరో సూపర్ సక్సెస్ పడ్డది.మరి ఇదే జోరు తన తర్వాత సినిమాల్లో కూడా నాని కంటిన్యూ చేయాలని కోరుకుందాం.