నందమూరి హీరో స్థానంలో లారెన్స్‌

నందమూరి హీరో కళ్యాణ్‌కు చాలా సంవత్సరాల తర్వాత సక్సెస్‌ అందించిన చిత్రం ‘పటాస్‌’.తెలుగులో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తమిళంలో ప్రముఖ నిర్మాత ఆర్‌.

 Nandamuri’s Super Hit Film In Lawrence Hands-TeluguStop.com

బి.చౌదరి నిర్మిస్తున్నాడు.మొదట ఈ సినిమాను చౌదరి తనయుడు జీవాతో రీమేక్‌ చేయాలని భావించారు.అయితే జీవా వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆలస్యం చేయడం ఇష్టం లేక ఈ రీమేక్‌కు రాఘవ లారెన్స్‌ను హీరోగా తీసుకోవడం జరిగిందని తెలుస్తోంది.

ఈ విషయాన్ని స్వయంగా రాఘవ లారెన్స్‌ తాజాగా ప్రకటించాడు.

ప్రస్తుతం తాను తమిళంలో ‘పటాస్‌’ సినిమా రీమేక్‌లో నటిస్తున్నట్లుగా రాఘవ లారెన్స్‌ ప్రకటించాడు.ఇటీవలే షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ రీమేక్‌ను త్వరలో పూర్తి చేసి విడుదల చేస్తాను అంటూ ప్రకటించాడు.ఇక నాగార్జునతో ఒక సినిమా ప్రాజెక్ట్‌ గురించి చర్చించాను అని కూడా చెప్పాడు.

తాను దర్వకత్వం వహించిన ‘కాంచన’ సినిమాకు మొదట నాగార్జునను హీరోగా అనుకున్నాను అని, అయితే ఆయన కథ విన్న తర్వాత ఈ కథ నా కంటే నీకే బాగా సూట్‌ అవుతుందని, నివ్వే హీరోగా చేయి అంటూ సలహా ఇచ్చాడు అంటూ లారెన్స్‌ చెప్పుకొచ్చాడు.పవన్‌ కళ్యాణ్‌ కోసం కూడా ఒక మంచి స్క్రిప్ట్‌ను రెడీ చేశాను అని, చిరు 150వ సినిమాకు కొరియోగ్రఫీ అందించే అవకాశం వస్తే తప్పకుండా తన ప్రతిభ చూపుతాను అంటూ లారెన్స్‌ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube