యువరాజుగా మోక్షజ్ఞ!

నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ప్రస్తుతం మోక్షజ్ఞ వైపు చూస్తున్నారు.బాలకృష్ణ తనయుడు అయిన మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అంటూ గత రెండు మూడు సంవత్సరాలుగా తారా స్థాయిలో ప్రచారం జరుగుతోంది.

 Nandamuri Mokshagna As Prince In Gautamiputra Satakarni-TeluguStop.com

రెండు సంవత్సరాలుగా నటన మరియు సినిమాకు సంబంధించిన రంగాల్లో శిక్షణ తీసుకుంటున్న మోక్షజ్ఞ పూర్తి స్థాయిలో రెడీ అయినట్లుగా తెలుస్తోంది.ఇక వచ్చే సంవత్సరం వెండి తెరపై మోక్షజ్ఞ అడుగిడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వచ్చే సంవత్సరంలో మోక్షజ్ఞ హీరోగా కాకున్నా తన తండ్రి ప్రస్తుతం నటిస్తున్న వందవ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలో అయినా నటించే అవకాశాలు ఉన్నాయి.

బాలకృష్ణ వందవ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రంలో మోక్షజ్ఞ యువరాజుగా చిన్న గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

బాలకృష్ణ తన ప్రతిష్టాత్మక వందవ సినిమా ద్వారా కొడుకును పరిచయం చేయాలని భావిస్తున్నాడు.అందుకోసం స్క్రిప్ట్‌లో అవసరమైన పాత్రను కూడా సృష్టించినట్లుగా తెలుస్తోంది.

కొన్ని నిమిషాలు మాత్రమే మోక్షజ్ఞ ఈ చిత్రంలో కనిపిస్తాడు అంటూ ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయమై సినిమా విడుదల వరకు కూడా సస్పెన్స్‌గానే ఉంచాలని భావిస్తున్నారు.

మరో వైపు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు కథలు సిద్దం అవుతున్నాయి.ఇప్పటికే పలు కథలను మోక్షజ్ఞ కోసం బాలయ్య పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube