కళ్యాణ్ రామ్ కూడా సిక్స్ ప్యాక్ చూపిస్తాడట..!

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరక్షన్లో ఇజం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.పూరి మార్క్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఓ సెన్షేషన్ క్రియేట్ చేసిన ఇజం సినిమా కళ్యాణ్ రామ్ ఏ సినిమాకు లేనంత ప్రీ రిలీజ్ బజ్ ఏర్పడింది.

 Nandamuri Hero Six Pack For Ism-TeluguStop.com

సినిమాలో కొత్త కళ్యాణ్ రామ్ ను చూస్తారు అని ముందు నుండి చెప్పుకొస్తున్న చిత్రయూనిట్ మొదటిసారిగా ఈ నందమూరి హీరో ఇజం కోసం సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేశాడట.

మొన్నటిదాకా రొమాంటిక్ అండ్ మాస్ ఎంటర్టైనర్ సినిమాలను తీస్తూ అడపాదడపా హిట్లు కొడుతున్న కళ్యాణ్ రామ్ ఈసారి తనలోని ఉన్న సరికొత్త యాంగిల్ ను ప్రెజెంట్ చేస్తున్నాడట.

పూరి ఇజం సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ పూర్తి మాస్ గెటప్లో కనిపిస్తాడట.అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దసరా రేసులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

మరి కళ్యాణ్ రామ్ చూపించబోతున్న సిక్స్ ప్యాక్ ఫ్యాన్స్ ను ఏవిధంగా అలరిస్తుందో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube