త్రిషని ముద్దుపెట్టుకున్న బాలయ్య

బాలకృష్ణది పసిపిల్లల మనసు అంటుంటారు ఆయన సన్నిహితులు.మనసులో ఒకటి దాచుకొని బయటకి ఒకటి చెప్పడం ఆయనకి చేత కాదని, ఏదైనా చెప్పాలనుకున్నా, చేయాలనుకున్నా చేసేయ్యటమే ఆయన నైజమని చెబుతూ ఉంటారు సినీజనాలు.

 Balakrishna Kisses Trisha-TeluguStop.com

అందుకే ఆయనకి ఇండస్ట్రీలో సన్నిహితులు ఎక్కువ.సినిమాల్లో ఎంత రౌద్రంగా కనిపిస్తారు, బయట అంతకంటే ఎక్కువ సరదాగా ఉండే మనిషి మన బాలయ్య బాబు.

బాలకృష్ణ నటించిన “లయన్” లో త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమా షూటింగ్ అప్పుడే త్రిషకి, బాలకృష్ణకి మంచి స్నేహం ఏర్పడింది.

బాలకృష్ణ సెట్లో చాలా సరదాగా ఉంటారని, ఒక స్టార్ లాగా ప్రవర్తించరని, తానూ జూనియర్ అయినా, ఫ్రెండ్లీగా ఉంటారని త్రిష కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

నిన్న త్రిష నటించిన “నాయకి” ఆడియో ఫంక్షన్ జరిగింది.

త్రిష కోసమని, బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఫంక్షన్ లో త్రిష కనబడగానే పలకరించి, ఇలా ఆత్మీయంగా ముద్దు పెట్టుకున్నారు.

వాళ్ళ మధ్య ఆత్మీయత ఉండి కాబట్టే ఇలా పలకరించుకున్నారు.ఇప్పుడు మహిళా సంఘాలు, మీడియావారు దీనికి ఎన్ని పెడర్థాలు తీస్తారో !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube