76 ఏళ్ల సీనియర్ హీరోతో నమిత పెళ్ళి?

నమిత గుర్తుందా? అదే, ఒకప్పుడు వెంకటేష్ తో జెమిని, శ్రీనువైట్ల దర్శకత్వంలో సొంతం లాంటి సినిమాలు చేసింది గుర్తుందా? అయినా ఎలా మర్చిపోతారు లేండి ఈ బొద్దు భామని.మధ్యలో మనకు తెలిసిన తెలుగు సినిమా బిల్లా ఒకటే అయినా, ఈ భామ పాపులారిటీ మాత్రం తగ్గలేదు.

 Namitha To Marry 76 Year Old Actor For Real?-TeluguStop.com

కుర్రాళ్ళు అలా ఎలా మర్చిపోతారు లేండి.తమిళనాట అయితే ఏకంగా నమితకి గుడి కట్టేసారు.

కాని ఒకప్పటి హవా ఇప్పుడు లేదు.

నమితాకి అవకాశాలు ఎప్పుడో తగ్గిపోయాయి.

దాంతో దొరికిన ప్రతి చిన్నాచితక సినిమా చేసుకుంటూ పోయింది.పరిస్థితి ఎలాంటి స్థితికి దిగజారింది అంటే, చెన్నై లో చాలాకాలం ఒక మామూలు ఇంట్లో అద్దెకు ఉంటూ వచ్చింది నమిత.

అప్పుడే బిగ్ బాస్ (తమిళం) అవకాశం తలుపు తట్టింది.నమిత ఫైనల్స్ దాకా వెళ్ళకపోయినా, ఎంతోకొంత డబ్బు అందటంతో ప్రస్తుతానికి ఫైనాన్సియల్ కష్టాలు పెద్దగా ఏమి లేవు అనుకుంటా.

కాని నమిత అన్నిరకాలుగా సెటిల్ అవడానికి సీనియర్ నటుడు శరత్ కుమార్ తో పెళ్ళికి సిద్ధపడిందని, వీరిద్దరూ త్వరలోనే పెళ్ళి చేసుకుంటారని ఓ పెద్ద రూమర్ మొదలైంది.నమిత వయసు 36.మరి శరత్ కుమార్ వయసు 77.తనకు సగం వయసున్న అమ్మాయితో శరత్ బాబు లాంటి సాఫ్ట్ మనిషి ఎలా పెళ్ళి చేసుకుంటున్నాడు అని అంతా చర్చించుకుండగానే, ఈ రూమర్ ని ఖండిచేసారు శరత్ బాబు.

తాను ఈ వయసులో పెళ్ళి చేసుకోవడం ఏంటని, నమితని కలిసి 8 సంవత్సరాలు అవుతోంది, తను అప్పుడు నటించిన ఓ సినిమాలో వేషం వేసాను, ఆ సినిమా పేరు కూడా గుర్తులేదు, నేను తనని పెళ్ళి చేసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోయారు శరత్ బాబు.మరి ఎలా పుట్టిందో ఈ వింత రూమర్.

నమిత నటించిన తమిళ సినిమా పొట్టు విడుదలకి సిద్ధమవుతుండగా, నటుడు శరత్ కుమార్ తన భార్య, సీనియర్ నటి రమాప్రభ తో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube