నిర్మలా కాన్వెంట్ సినిమాకి అన్నీ తానే అయ్యి ప్రమోషన్ చేస్తున్నాడు హీరో నాగార్జున.తన స్టైల్ లో పాటలు కూడా పడేస్తున్నాడు.
మొన్నటి వరకూ సినిమాలో ఒక పాత్ర చేసినట్టు కనిపించిన నాగార్జున ఈ సినిమా కోసం ఇప్పుడు ఏకంగా సింగర్ అవతారం ఎత్తేశాడు.అప్పుడెప్పుడో సీతారామరాజు సినిమా కోసం తన స్వరాన్ని సరిజేసుకుని అభిమానులని అలరించిన నాగార్జున ఇన్నాళ్ళ తరవాత ఒక ఫుల్ సాంగ్ ని అందరి కోసం పాడేసాడు.
ఆల్రెడీ నిర్మాలా కాన్వెంట్ లో ఉన్న కొత్త కొత్త బాష అనే పాటని ఇప్పటికే ఎ ఆర్ రెహమాన్ కొడకు ఏ ఆర్ అమీన్ తో పాడించారు ఇదే పాటని నాగార్జున తన వెర్షన్ లో పాడేసాడు.అయితే ఈ పాట బాగా నచ్చడం తో నగర్జున కోరికే మేరకే వీడియో సాంగ్ గా దీన్ని తీసి చిత్రీకరణ చేస్తున్నారు.
రాగాలు తీయడం రాదనీ తెల్చేస్తూ చాలా చోట్ల హమ్మింగ్ చేసేసాడు.సంగీత దర్శకుడు రోషన్ సాలూరి నాగార్జున స్వరాన్ని చాలా ఒరిజినల్ గా ఒదిలేయడం తో పాటలోని స్వరం కాస్త మిస్ అయింది కానీ వీడియో సాంగ్ మాత్రం నాగార్జున స్క్రీన్ ప్రేజేన్స్ తో కుమ్మేసింది.