నాగార్జున నిర్మాణంలో మరోసారి ఆ హీరో

అక్కినేని నాగార్జునకి అభిరుచి గల నిర్మాతగా పేరుంది.ఈ మధ్యకాలంలో “నిర్మల కాన్వెంట్” అన్నపూర్ణ స్టూడియోస్ ఇమేజ్ ని దెబ్బతీసింది కాని, మనం, ఉయ్యాలా జంపాలా, సోగ్గాడే చిన్ననాయన లాంటి బంపర్ హిట్స్ కొట్టేసారు నాగ్.

 Nagarjuna To Produce Another Film With This Young Hero ?-TeluguStop.com

ముఖ్యంగా ఉయ్యాలా జంపాలా చిత్రంతో రాజ్ తరుణ్ లాంటి సంచలన యువహీరోని తెలుగు తెరకి పరిచయం చేసారు నాగార్జున.ఇప్పుడు మళ్ళీ అదే రాజ్ తరుణ్ తో మరో సినిమా మన కింగ్ నిర్మించాబోతున్నారని తెలియవస్తోంది.

ఈ సినిమాకి దర్శకుడు కాదు, దర్శకురాలు ఉండబోతోంది.పేరు బయటకి తెలియట్లేదు కాని ఓ ప్రతిభావంతమైన లేడి డైరెక్టర్ ఈ సినిమాని తెరకేక్కిస్తుందని టాక్.

ఇది ఒక ప్రేమ కథ చిత్రం అంట.హీరోయిన్ ఎవరు, దర్శకురాలు ఎవరు .మిగితా వివారాలన్ని త్వరలోనే ప్రకటిస్తారు.

ఇక మన యంగ్ హీరో రాజ్ తరుణ్ విషయానికొస్తే, వరుస విజయాలతో ఊపు మీద ఉన్న ఈ కుర్ర హీరో త్వరలోనే “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” అనే సినిమాతో మన ముందుకి రాబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube