అక్కినేని నాగార్జున సోగ్గాడే..!

టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున నటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ఫస్ట్‌లుక్‌ టీజర్‌ నేడు విడుదలైంది.నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన ఈ బుల్లి టీజర్‌ అక్కినేని ఫ్యాన్స్‌కు ఫుల్‌ ఖుషీని కలిగిస్తోంది.

 Nagarjuna Soggade Chinni Nayana Teaser-TeluguStop.com

టాలీవుడ్‌ సోగ్గాడిగా పేరున్న నాగార్జున ఈ సినిమాతో మరోసాని తన పేరును సార్థకం చేసుకోబోతున్నాడు అనే విషయం ఈ టీజర్‌తో తేలిపోయింది.రెండు వైవిధ్యభరిత పాత్రల్లో నాగార్జున ఈ సినిమాలో కనిపించనున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో నాగార్జున పోషించిన తండ్రి పాత్ర ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకోనుందని అంటున్నారు.చిలిపిగా, అల్లరిగా నాగార్జున నుండి ఫ్యాన్స్‌ ఏం కోరుకుంటున్నారో అదే ఈ సినిమాలో కనిపించనుందని అంటున్నారు.

భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాతో కళ్యాణ్‌ కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.నాగార్జున మరియు రామ్మోహన్‌లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసే అవకాశాలున్నాయి.చాలా కాలం తర్వాత నాగార్జున డబుల్‌ రోల్‌లో ఈ సినిమాలో నటించాడు.

రమ్యకృష్ణ మరియు లావణ్య త్రిపాఠి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

సోగ్గాడే చిన్నినాయన టీసర్ కోసం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube