నాగ్‌ మూవీ సస్పెన్స్‌కు తెర

‘మనం’ సినిమా తర్వాత నాగార్జున తన తర్వాత సినిమాకు చాలా గ్యాప్‌ తీసుకున్నాడు.‘భాయ్‌’ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

 Nagarjuna Role In Karthi Multi Starrer Movie Revelead-TeluguStop.com

తాజాగా నాగార్జున రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.అందులో ఒకటి ‘సోగ్గాడే చిన్ని నాయనో’.

ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఇక రెండవది తమిళ స్టార్‌ హీరో కార్తీతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా.

ఈ సినిమాలో నాగార్జున కాళ్లు లేని అవిటి వాడిగా కనిపించనున్నాడు అంటూ మొదటి నుండి ప్రచారం జరిగింది
నాగార్జున కాళ్లు లేనివాడిగా నటిస్తాడని అనుకోవడం లేదని ఫ్యాన్స్‌ అన్నారు.మన్మధుడిని అలా చూడటం కష్టమే సినీ విశ్లేషకులు సైతం అనుకున్నారు.

అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అయ్యి ఉంటాయి అంటూ ప్రేక్షకులు భావించారు.అయితే అప్పుడు జరిగిన ప్రచారమే నిజం అని తేలిపోయింది.

నాగార్జున ఈ సినిమాలో నడవలేని పరిస్థితిలో ఉంటాడు అని, ఆయనకు సేవలు చేసే వ్యక్తిగా కార్తీ కనిపిస్తాడు అంటూ తాజాగా విడుదలైన ఒక ఫొటోతో క్లారిటీ వచ్చింది.ఇన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు బ్రేక్‌లు పడ్డాయి.

ఇక ఈ సినిమాలో తమన్నా పాత్ర ఏంటి అనేది తేలాల్సి ఉంది.ఈ సినిమాకు ‘దోస్త్‌’, ‘మిత్రులు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube