నాగార్జున అదే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు

సంక్రాంతి అన్నాక తెలుగు సినిమాలు విడుదల అవకుండా ఉంటాయా ! అందులోను మూడు నాలుగు సినిమాలు పోటిపడకుండా ఉంటాయా! ప్రతీ ఏడాది రెండు మూడు సినిమాలు ఖచ్చితంగా బరిలో ఉంటున్నాయి.ఈసారి కూడా అంతే.

 Nagarjuna In Deep Thinking About Clash With Chiranjeevi And Balakrishna-TeluguStop.com

మూడు పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా వచ్చేలా ఉన్నాయి ఈ సంక్రాంతికి.

ప్రస్తుతం ప్రకటించిన విడుదల తేదిల ప్రకారం చూస్తే బాలకృష్ణ వందొవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సంక్రాంతి పోటిని ప్రారంభిస్తుంది.

ఈ సినిమా జనవరి 13న ఫైనల్ అయిపోయింది.చిరంజీవి ఖైదీ నం.150, శర్వానంద్ “శతమానంభవతి” రెండూ వచ్చే విడుదల తేది ఇంకా బయటకి తెలియకపోయినా, ఈ రెండూ సంక్రాంతి బరిలో దిగడం ఖాయం.

ఇక నాగార్జున తన “ఓం నమో వెంకటేశాయ” ని సంక్రాంతి పోటిలో దింపాలా లేక జనవరి మొదటివారంలో సినిమాని తీసుకొద్దామా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారట.

నాగ్ గత సంక్రాంతికి తీసుకొచ్చిన “సోగ్గాడే చిన్నినాయన” భారి సక్సెస్ ని చూడటంతో, ఆ సెంటిమెంట్ కోసమైనా సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణతో పోటిపడవచ్చు.

ఆ సెంటిమెంట్ ఎందుకు, ఒక్కడినే బాక్సాఫీస్ వద్ద అదృష్టం పరీక్షించుకుందాం అని అనుకుంటే జనవరి మొదటివారంలోనే నాగ్ సినిమా రావొచ్చు.

చూద్దాం .సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు మిగిలుతాయో లేల మూడు పెద్ద సినిమాలు ఉంటాయో!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube