ఎన్టీఆర్ తో పోటిలో నాగచైతన్య

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

 Nagachaitanya To Clash With Ntr ?-TeluguStop.com

ప్రతి షెడ్యులు అనుకున్న టైం ప్రకారమే జరుగుతోంది.ఈ స్పీడు చూస్తోంటే, ముందే ప్రకటించినట్టుగా ఆగస్టు 12న ఈ సినిమా విడుదల అవడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే ఇప్పటివరకు మా సినిమాకి పోటి లేదని సంబరపడ్డ నిర్మాతలకు చిన్నిపాటి షాక్ ఇచ్చేలా ఉన్నాడు నాగచైతన్య.ఈ అక్కినేని హీరో నటిస్తున్న ప్రేమమ్ ని సరిగ్గా ఆగస్టు 12నే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట ఆ చిత్రం యొక్క నిర్మాతలు.

ఇదే నిజమైతే, యంగ్ టైగర్ తో బాక్సాఫీస్ బరిలో తలపడతాడు చైతు.

ఎన్టీఆర్ రేంజ్ చాలా పెద్దదే అయినా, స్క్రీన్స్ చాలావరకు మింగేస్తుంది ప్రేమమ్.

అప్పుడు రికార్డు రిలీజ్ కష్టమైపోతుంది జనతా గ్యారేజ్ కు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube