కల్యాణానికి తమన్నా ఫిక్స్ అయింది

ప్రస్తుతం నాగ చైతన్య నటిస్తున్న సినిమా ‘కళ్యాణం’ లో హీరోయిన్ గా తమన్నా ఫిక్స్ అయింది.మొదట నాగ చైతన్య సరసన సమంతా నటిస్తుందనే వార్తలు వచ్చాయి.

 Naga Chaitanya’s ‘kalyanam’ With Tamanna?-TeluguStop.com

ఆ తర్వాత కొన్ని రోజులకు సమంతా స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ వచ్చింది.ఇప్పుడు మరొక హీరోయిన్ పేరు వినపడుతుంది.

నాగ చైతన్యతో 100 %లవ్ ,తడాఖా సినిమాల్లో జోడి కట్టిన మిల్కీబ్యూటీని ‘కల్యాణం’ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్ చేశారని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.ఈ రెండు సినిమాల్లో ఈ జోడి కి మంచి మార్కులే పడ్డాయి.

అంతేకాక రెండు సినిమాలు హిట్ అయ్యాయి.దాంతో దర్శక నిర్మాతలు కూడా తమన్నాకే ఓటు వేశారు.

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చైతూ – తమ్మూ కలిసి నటిస్తే ఈ జోడికి హ్యాట్రిక్ హిట్ వచ్చినట్టే అని ఫిల్మ్ నగర్ లో అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube