సునీల్ వద్దంటు పక్కనపెట్టేసిన డైరెక్టర్ ?-N.Shankar Called Off The Film With Sunil? 3 months

N Shankar N.Shankar Called Off The Film With Sunil? Sunil Sunil Career In Danger Two Countries Photo,Image,Pics-

హీరో సునీల్ టైమ్ అస్సలు బాగాలేదు. ఈ ఏడాది ఆరంభంలోనే కృష్ణాష్టమి లాంటి భారి ఫ్లాప్ ని చవిచూసిన సునీల్ ఆ తరువాత జక్కన్నతో కొద్దిగా కోలుకున్నట్లే కనిపించాడు. ఈ సినిమా కూడా జనాల్ని పెద్దగా ఆకట్టుకోకున్నా, గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్లు ఫర్వాలేదనిపించింది. ఇక మొన్న వచ్చిన ఈడు గోల్డ్ ఎహే గురించి సునీల్ ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది.

పంపిణీదారులకు, నిర్మాతకు, సునీల్ కు .. అందరికీ చుక్కలు చూపించిన సినిమా ఇది. అది ఏ రేంజ్ లో అంటే ఓవర్సీస్ లో కేవలం 64 డాలర్లు కలెక్ట్ చేసి, ఈ సినిమాను ప్రదర్శించొద్దు అని థియేటర్ ఓనర్లకు కబురు పెట్టేంత. మాస్ కామెడితో తెలుగు రాష్ట్రాల్లో అయినా ఏమైనా లాగిందా అంటే అదీ లేదు. ప్రేమమ్ దెబ్బకు బొక్కబోర్ల పడింది. ఇప్పుడు ఈ ఘోర అపజయం సునీల్ కెరీర్ ని దారుణంగా దెబ్బతీసేలా ఉంది.

దర్శకుడు ఎన్.శంకర్ ఆమధ్య సునీల్ తో మలయాళ సూపర్ హిట్ “టూ కంట్రీస్” ని రీమేక్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చు అని, మార్కేట్ కోల్పోతున్న సునీల్ తో రిస్క్ చేయడానికి దర్శకుడు ఇష్టపడట్లేదని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే సునీల్ మార్కేట్ మరింత పడిపోవచ్చు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. బాహుబలిని దాటిన మెగాస్టార్ స్టామినా

About This Post..సునీల్ వద్దంటు పక్కనపెట్టేసిన డైరెక్టర్ ?

This Post provides detail information about సునీల్ వద్దంటు పక్కనపెట్టేసిన డైరెక్టర్ ? was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

N.Shankar called off the film with Sunil?, N.Shankar, Sunil, Two Countries, Eedu Gold Ehe, Sunil Career in Danger

Tagged with:N.Shankar called off the film with Sunil?, N.Shankar, Sunil, Two Countries, Eedu Gold Ehe, Sunil Career in DangerEedu Gold Ehe,N Shankar,N.Shankar called off the film with Sunil?,sunil,Sunil Career in Danger,Two Countries,,