సాయంత్రం అయ్యిందంటే, మనలో చాలామంది చేసే పని మొబైల్ కి ఇయర్ ఫోన్ తగిలించేసుకోని పాటలు వినడం.పాటలు వింటాం కాని, చాలాసార్లు మనం వింటున్న లిరిక్స్ అర్థం కాదు.
ఈ ఆధునిక సంగీతంలో సాహిత్యాన్ని శబ్దం డామినేట్ చేస్తుండటంతో, ఈ లైన్ లో ఏం రాసారబ్బా అనుకుంటూ, ఒకటికి పదిసార్లు పాటను వినాల్సిన పరిస్థితి.కాని ఇప్పుడా అవసరం లేదు.
సాహిత్యం చదువుకుంటూ ఎంచక్కా పాటలు వినేయొచ్చు.
ముసిక్స్ మ్యాచ్ (MusixMatch) అనే అప్లికేషన్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఏ పాటైతే మీ స్మార్ట్ ఫోన్ లో ఈ ఆప్ ద్వారా ప్లే చేస్తారో, ఆ పాటకి సంబంధించిన లిరిక్స్ ని స్వయంగా స్టోర్ చేసుకుంటుంది ఈ ఆప్.అలా ఒక్కసారి స్టోర్ అయినా లిరిక్స్ ని మీరు ఆఫ్ లైన్ లో కూడా చూస్తూ పాట వినొచ్చు.
అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, వైఫై ఆన్ చేయండి, మీ ఫోనులో ఉన్న పాటలన్ని ఓసారి అలా ముసిక్స్ మ్యాచ్ ద్వారా ప్లే చేయండి.ఆ తరువాత మీరు ప్రయాణాల్లో ఉన్నా, ఇంటర్నెట్ కనెక్షన్ కి దూరంగా ఉన్నా, అప్పటికే ప్లే చేసిన ప్రతి పాటను లిరిక్స్ చదువుకుంటూ వినొచ్చు.