ముద్ర చేరిపేసుకుంటున్న తమన్

ఎవరిమీదైనా ప్రేక్షకులు ఒక ముద్ర వేశారంటే దాన్ని చేరిపేసుకోవడం చాలా కష్టం.ట్యూన్స్ కాపి కొడతాడని, కొత్తదనం ఉండదని, డప్పులు తప్ప ఇంకేమి వాడడు అని .

 Thaman Trying To Change His Image-TeluguStop.com

ఇలా తమన్ మీద చాలా నిందలు ఉన్నాయి.ట్యూన్స్ అందరు కాపి కొడతారు .కాని తమన్ త్వరగా దొరికిపోతాడు.

ఈ మధ్య కాలంలో తమన్ మీద అందరు విరుచుకుపడటానికి కారణం తనిచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .ఆగడు సినిమాకి తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం ఏ మాత్రం బాగా లేదు.చాలా చెత్తగా ఆ సినిమాకి పనిచేసాడని అప్పట్లో చాలా మంది విమర్శించారు.

అయితే ఇందులో తమన్ తప్పు పెద్దగా లేదు .దర్శకుడు శ్రీనువైట్ల తమన్ కి తగిన సమయం ఇవ్వలేదు .ఈ విషయాన్ని స్వయంగా శ్రీనువైట్లనే ధృవికరించారు.అయితే ఈ విషయం ఎంతమంది ప్రేక్షకులకి తెలుసు ! అందుకే తనపై పడ్డ నిందను తొలగించుకునే పనిలో పడ్డాడు తమన్.

సందీప్ కిషన్ టైగర్ సినిమా సరిగా ఆడకపోయినా, అందులో తమన్ అందించిన నేపథ్య సంగీతానికి చాల పేరొచ్చింది… ఇక నిన్నే విడుదలైన బాలకృష్ణ డిక్టేటర్ మోషన్ పోస్టర్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి మార్కులు వేసారు సినీజనాలు .దెబ్బ తగిలితే తగిలింది … గుణపాఠం నేర్చుకున్నాడు తమన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube