జనవరి ఒకటో తేదీ వస్తుందంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ ఒకటే హడావిడి.కాలం త్వరగా గడిచిపోతుందన్న చింతకన్నా రానున్న ఏడాది కొత్త కొత్తగా ఉంటుందనే ఆశలతో అందరూ ముందుకు సాగుతుంటారు.
ఆ క్రమంలోనే డిసెంబర్ 31వ తేదీ రాత్రి చాలా హడావిడిగా గడుపుతుంటారు.కొత్త ఏడాది పూట ఇంట్లో గడపాలనుకునేవారు కొందరైతే, మరికొందరు మాత్రం హడావిడిగా తమ బంధువులతోనూ, స్నేహితులతోనూ గడిపేస్తుంటారు.
ఇదంతా సాదాసీదా వారి విషయం.కానీ సెలబ్రిటీల విషయం అందుకు మారుగా ఉంటుంది.
సెలబ్రిటీలకు డిసెంబర్ 31 రాత్రి కాసుల వర్షం కురుస్తుంటుంది.వారు ఒప్పుకునే ఫంక్షన్లను బట్టి వారికి ఎక్కువ మొత్తంలో పారితోషికం అందుతుంటుంది.
ఆ కోవలో ఈ ఏడాది తొలుత తన ప్లాన్‌ను చెప్పింది మాత్రం సంగీత దర్శకుడు తమన్.డిక్టేటర్ పాటలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న తమన్ ఈ డిసెంబర్ 31న గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో గడపనున్నారు.
తన మ్యూజికల్ నైట్‌తో పాటు ఆయన పలు కార్యక్రమాలను కూడా చేయనున్నారు.అందులో భాగంగా కొంతమంది కమెడియన్లను, కొంతమంది డ్యాన్సర్లను కూడా అప్రోచ్ అయ్యారు.
సో తమన్ బ్లాస్ట్ ఈ సారి హాయ్‌ల్యాండ్‌లో అన్నమాట.