ఎమ్మెల్యేగా ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి..!

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జూలై నుంచి స్టార్ట్ అవుతుంద‌ని కేసీఆర్ ధీమాగా ప్ర‌క‌ట‌న చేయ‌డంతో తెలంగాణ‌లోని అన్ని రాజ‌కీయాప‌క్షాల‌కు చెందిన నాయ‌కుల్లో ఎక్క‌డా లేని ఉత్సాహం వ‌చ్చింది.మిగిలిన పార్టీల నాయ‌కుల కంటే మ‌రోసారి టీఆర్ఎస్సే అక్క‌డ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ముంద‌స్తు అంచ‌నాల‌తో అధికార పార్టీ నాయ‌కుల ఆనందానికి అవ‌ధులు లేవు.

 Mp Ponguleti Srinivas Reddy Eye On Mla Seat-TeluguStop.com

ప్ర‌స్తుతం ఉన్న 119 నియోజ‌క‌వ‌ర్గాలు పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే 153 నియోజ‌క‌వ‌ర్గాలు అవుతాయి.

అదే జ‌రిగితే అధికార పార్టీలో చాలా మందికి ఎమ్మెల్యే టిక్కెట్లు వ‌స్తాయి.

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త ఆశావాహుల‌తో పాటు ప్ర‌స్తుతం ఎంపీలుగా ఉన్న‌వారు సైతం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఆస‌క్తితో ఉన్న‌ట్టు టీఆర్ఎస్ వ‌ర్గాల్లో ఎప్ప‌టి నుంచో ఇంట‌ర్న‌ల్ ప్ర‌చారం జ‌రుగుతోంది.ఈ జాబితాలో కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ ఎంపీ క‌విత‌, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, పెద్ద‌పల్లి ఎంపీ బాల్క సుమ‌న్‌, ఆదిలాబాద్ ఎంపీ జి.న‌గేష్ త‌దిత‌రుల పేర్లు ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ లిస్టులోనే ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా చేరిన‌ట్టు తెలుస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున ఖ‌మ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు.ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఆస‌క్తితో ఉన్నార‌ట‌.

ప్ర‌స్తుతం ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్న వారంద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి టీఆర్ఎస్ గెలిచి అధికారంలోకి వ‌స్తుంద‌ని.ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ చ‌క్రం తిప్పాల‌న్న ప్లాన్‌తోనే వారు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆస‌క్తితో ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే పొంగులేటి సైతం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ఎంపీగా కంటే ఖ‌మ్మం రూర‌ల్ లేదా క‌ల్లూరు కేంద్రంగా ఏర్ప‌డే నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఆస‌క్తి చూపుతున్న‌ట్టు టాక్‌.ప్ర‌స్తుతం మంత్రి కేటీఆర్ గ్రూప్‌లో ఉంటోన్న పొంగులేటి కేటీఆర్ అండ‌దండ‌ల‌తోనే జిల్లాలో ముందుకు సాగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

నియోజ‌క‌వర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే పొంగులేటి కోరిక తీర‌డం క‌ష్టం కాదు.ఒక‌వేళ ప్ర‌స్తుతం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు కొన‌సాగితే ఆయ‌న ఆశ తీర‌డం కష్ట‌మే.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube