పశ్చిమ టీడిపిలో రాజీనామాలు..

పశ్చిమ టీడీపిలో రాజకీయం వేడెక్కుతోంది.ఏలూరు ఎంపీ మాగంటి బాబు.

 Mp Maganti Babu Supporters,zptc, Resigned To  Tdp-TeluguStop.com

చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత మధ్య వార్ చాలా తీవ్రంగా నడుస్తోంది.చివరికి ఆ నియోజక వర్గ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు రాజీనామాలు చేసే పరిస్థితి వరకూ వచ్చింది.

ఇప్పటికే పశ్చిమ తెదేపాలో అసమ్మతి తీవ్రస్థాయిలో ఉంది అయినా సరే పార్టీ అధిష్టానంకి భయపడి ఎవ్వరు నోరు మెదపడటం లేదు కానీ ముందు నుంచి పీతల సుజాత విషయంలో మాగంటి చాల సీరియస్ గా ఉంటూనే ఉన్నారు.జిల్లాలో ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవులు భర్తీ చేసేశారు.

కానీ ఇప్పటివరకు చింతలపూడి మార్కెట్ కమిటీ స్థానం అలానే ఉంది.కారణం మా వాళ్ళు ఉండాలి అంటే మా వాళ్ళు ఉండాలి అని ఇరువురు నేతలు పంతాలకి పోవడమే.

మాగంటి బాబు తనకి సంభందిచిన ఒక వ్యక్తిని కమిటీ చైర్మెన్ గా సిపార్స్ చేస్తూ జీవో కూడా తెచ్చుకుంటే ఆ నియోజకవర్గం మాజీ మంత్రి.ప్రస్తుత ఎమ్మెల్యే పీతల సుజాత ఆ జీవో ని రద్దు చేయించారు.

తన అనుచరులకే ఏఎంసీ పదవి ఇవ్వాలనేది పీతల డిమాండ్.దీంతో ఖంగు తిన్న మాగంటి.

అనంతపురం ఎంపీ జేసే దివాకర్ రెడ్డి తరహలోనే అధిష్టానం మీద వత్తిడి తెచ్చేందుకు సిద్దమవుతున్నారు.ఎందుకంటే చాగల్లు రిజర్వాయర్ కి నీటిని విడుదల చేయకపోతే రాజీనామకి సిద్దం అని జేసి ప్రకటించగానే ప్రభుత్వం జేవో విడుదల చేసింది.

ఇప్పుడు అదే తరహాలో ఒత్తిడి తెస్తున్నారు.

రెండు వర్గాల మధ్య మూడున్నరేళ్లుగా సాగుతున్న ఈ వివాదం ఇంతవరకూ పరిష్కారం కాలేదు.

రెండురోజుల క్రితం మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణరావులు రెండు వర్గాల మధ్య సయోధ్యకు ప్రయత్నించినా కుదరలేదు.ఎంపీ మాగంటి, ఎమ్మెల్యే పీతల వర్గాలు రెండూ కూర్చుని చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని మంత్రులిద్దరూ చెప్పి వెళ్లిపోయారు.

అయినా రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు.ఎంపీ మాగంటి వర్గం రాజీనామాకు సిద్ధమైంది.

పీతల సుజాతకు మద్దతు పలుకుతున్న కొందరు అధిష్గానం పెద్దలపైనా తమ రాజీనామా అస్త్రాలని ప్రయోగించాలని చూస్తున్నారు.మరి ఈ రాజీనామాల విషయంలో చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube