జ‌గ‌న్‌కు షాక్‌: టీడీపీలోకి వైసీపీ ఎంపీ

ఏపీలో కొద్ది రోజుల వ‌ర‌కు చాలా స్పీడ్‌గా జ‌రిగిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఇప్పుడు కాస్త స్లో అయ్యింది.ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కాస్త స్లో అవ్వ‌డం, ప్లీన‌రీ హిట్ అవ్వ‌డంతో కాస్త జోష్‌లో ఉన్న జ‌గ‌న్‌కు ఇప్పుడు మ‌రో షాక్ త‌గ‌ల‌నున్న‌ట్టు క‌ర్నూలు జిల్లాలో టాక్ న‌డుస్తోంది.

 Mp Butta Renuka To Quit Ycp-TeluguStop.com

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌కాలంగా హ‌వా కొన‌సాగిస్తోంది మాజీ ముఖ్య‌మంత్రి కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి ఫ్యామిలీ.కోట్ల త‌న‌యుడు కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి క‌ర్నూలు నుంచి రెండుసార్లు వ‌రుస‌గా ఎంపీగా గెల‌వ‌డంతో పాటు కేంద్ర మంత్రిగా కూడా ప‌నిచేశారు.

ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో ఉన్న ఆయ‌న త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌తో పాటు త‌న వార‌సుడు ఫ్యూచ‌ర్ కోసం వైసీపీ వైపు అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.జిల్లాలో కోట్ల‌కు ఇప్ప‌ట‌కీ బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఉంది.

ఆయ‌న వైసీపీలో చేరితే సీమ‌లోని ఇత‌ర జిల్లాల్లో కూడా ఆయ‌న బంధుగ‌ణం వైసీపీకి బ‌లంగా మార‌తారు.ఇక కోట్ల పార్టీలోకి వ‌స్తే ఆయ‌న‌కు మంచి ప్ర‌యారిటీ ఇచ్చేందుకు జ‌గ‌న్ కూడా సిద్ధంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

కోట్ల‌కు క‌ర్నూలు ఎంపీ సీటుతో పాటు ఆయ‌న త‌న‌యుడు రాఘ‌వేంద్ర‌రెడ్డికి ప‌త్తికొం లేదా డోన్ లేదా ఆలూరులో ఏదో ఒక అసెంబ్లీ సీటు కేటాయించేందుకు జ‌గ‌న్ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.మరి కోట్ల‌కు క‌ర్నూలు ఎంపీ సీటు ఇస్తే ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుట్టా రేణుకు ప‌ని ఖేల్ ఖ‌తం అయిన‌ట్టే.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తోన్న ఆమె కోట్ల పార్టీలోకి వ‌స్తే తాను టీడీపీలోకి జంప్ చేసేందుకు ఆమె ప్ర‌య‌త్నాలు ఆమె చేసుకుంటున్నార‌ట‌.

వాస్త‌వానికి గ‌తంలోనే నంద్యాల ఎంపీ ఎస్పైవై రెడ్డి టీడీపీలోకి వెళ్లిన‌ప్పుడు బుట్టా రేణుక భ‌ర్త కూడా టీడీపీలో చేరారు.

అప్పుడే రేణుక కూడా పార్టీ మార‌తార‌ని వార్త‌లు వ‌చ్చినా ఆమె సైలెంట్ అయ్యారు.ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో రేణుక‌కు జ‌గ‌న్ టిక్కెట్ ఇవ్వ‌ర‌న్న సిగ్న‌ల్స్ వెళ్లిపోవ‌డంతో ఆమె ఇప్పుడు జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చి టీడీపీలో చేరేందుకు రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube