‘మోసగాళ్లకు..’ బాక్సాఫీస్‌ రిపోర్ట్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణ అల్లుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సుధీర్‌బాబు తాజాగా ‘మోసగాళ్లకు మోసగాడు’ అంటూ వచ్చాడు.‘స్వామిరారా’ సినిమాకు సీక్వెల్‌ అంటూ ప్రచారం జరిగిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

 Mosagallaku Mosagadu Movie Box Office Collections-TeluguStop.com

అయినా కూడా ఈ సినిమాకు మొదటి మూడు రోజుల్లో కలెక్షన్స్‌ ఏమాత్రం ఆశాజనకంగా లేవు.మొదటి మూడు రోజులు కలిపి కూడా కేవలం 4.5 కోట్లు వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది.

సినిమా ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే మరో రెండు లేదా రెండున్నర కోట్లు వసూళ్లు చేసి బిజినెస్‌ క్లోజ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మొత్తానికి ఈ సినిమా 6.5 కోట్లకు మించి ఉండే అవకాశాలు లేవని అంటున్నారు.మొదటి వారం రోజులు ముక్కుతూ మూలుగుతూ లాకొచ్చే అవకాశాలున్నాయి.కాని ఈ వారం మే 29న ప్రేక్షకుల ముందుకు రామ్‌ ‘పండగ చేస్కో’ మరియు సూర్య ‘రాక్షసుడు’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఈ నేపథ్యంలో ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను థియేటర్ల నుండి మొత్తంగా తీసి వేసే అవకాశాలున్నాయి.మొత్తానికి ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్‌ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube