మన క్రికేటర్లలో ఎవరి నెలజీతం ఎంతో తెలుసా ?

మనదేశంలో క్రికేట్ అనేది అన్నిమతాల వారు ఫాలో అయ్యే మతం కాబట్టి, మనదేశంలో ఉన్నంత డిమాండ్, ఈ ఆటకి మరో దేశంలో లేదు.ఆదాయం ఎక్కువ, అందుకే క్రికేటర్లకి జీతాలు కూడా ఎక్కువ.

 Monthly Salaries Of Indian Cricketers-TeluguStop.com

మరి ఎప్పుడైనా ఆలోచించారా మన క్రికేటర్ల నెల జీతాలు ఎంత ఉంటాయో?

మన క్రికేటర్లను మూడు గ్రేడులలో విభిజిస్తింది క్రికేట్ బోర్డు.అవే ఏ గ్రేడు, బీ గ్రేడ్ మరియు సీ గ్రేడ్.

టీమ్ లో ఆటగాడి అవసరాన్ని బట్టి, ఎన్ని ఫార్మాట్స్ రెగ్యులర్ గా ఆడుతున్నాడు, అతని ఆటతీరుని బట్టి ప్రమోషన్, డిమోషన్ ఉంటుదన్నమాట.మరి ఏ గ్రేడ్ లో ఏ ఆటగాడు ఉన్నాడో, ఎవరికి ఎంత నెలజీతం వస్తుందో చూసేద్దామా ?

ఏ గ్రేడ్ ఆటగాళ్ళు : (ఏడాదికి కోటి రూపాయల జీతం)

* విరాట్ కొహ్లీ – నెలకి 8.3 లక్షలు
* మహేంద్ర సింగ్ ధోని – నెలకి 8.3 లక్షలు
* రవిచంద్రన్ అశ్విన్ – నెలకి 8.3 లక్షలు
* అజింక్యా రహానే – నెలకి 8.3 లక్షలు

బి గ్రేడ్ ఆటగాళ్ళు – (ఏడాదికి 50 లక్షల జీతం)

* రోహిత్ శర్మ – నెలకి 4.2 లక్షలు
* సురేష్ రైనా – నెలకి 4.2 లక్షలు
* శిఖర్ ధవన్ – నెలకి 4.2 లక్షలు
* మురళీ విజయ్ – నెలకి 4.2 లక్షలు
* భువనేశ్వర్ కుమార్ – నెలకి 4.2 లక్షలు
* అంబటి రాయుడు – నెలకి 4.2 లక్షలు
* ఇషాంత్ శర్మ – నెలకి 4.2 లక్షలు
* చటేశ్వర్ పుజార – నెలకి 4.2 లక్షలు
* మొహమ్మద్ షమీ – నెలకి 4.2 లక్షలు

గ్రేడ్ సి ఆటగాళ్ళు – (ఏడాదికి 25 లక్షల జీతం)

హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా, కే ఎల్ రాహుల్, కరుణ్ నాయర్ .ఇక్కడినుంచి భారత్ కి ఇంటర్నేషనల్ క్రికేట్ ఆడుతున్నవారంతా సి గ్రేడ్ లోకి వస్తారు.వీరి నెల జీతం 2.1 లక్షలు.

అయితే క్రికేటర్స్ సంపాదన కేవలం జీతం ద్వారానే రాదు.సాలరీతో పోల్చుకుంటే యాడ్స్, ఐపియల్ నుంచి చాలా ఎక్కువ వస్తుంది.ఉదాహరణకు చెప్పాలంటే, విరాట్ కొహ్లీ జీతం ఏడాదికి కోటి రూపాయలు అయితే, అతను బ్రాండ్స్ నుంచి 250-300 కోట్లు అర్జిస్తాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపియల్ లో ఆడే కొహ్లీకి, సీజన్ కి 15 కోట్లు చెల్లిస్తుంది ఆ జట్టు యాజమాన్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube