2017 వరకు ఆగండి

నందమూరి ఫ్యాన్స్‌ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే మోక్షజ్ఞ హీరో అవుతాడు అని ప్రకటించిన బాలయ్య ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనే విషయంలో తాజాగా క్లారిటీ ఇచ్చాడు.తాజాగా బాలయ్య ‘లయన్‌’ సినిమా ప్రెస్‌మీట్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తన వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశ విశేషాలను పంచుకున్నాడు.2017లో వారసుడి ఎంట్రీ ఉంటుందని, ఇప్పటి వరకు మోక్షజ్ఞ కోసం స్క్రిప్ట్‌లు ఏం వినలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

 Mokshagna Debut In 2017-TeluguStop.com

హీరోయిన్‌ తనను తాను నిరూపించుకునేందుకు ఇప్పటి నుండే మోక్షజ్ఞ కష్టపడుతున్నాడు.ప్రస్తుతం అమెరికాలోని ప్రముఖ యాక్టింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.కేవలం యాక్టింగ్‌పైనే దృష్టి పెట్టకుండా డ్యాన్స్‌ మరియు ఫైట్స్‌ ఇంకా ఇతర అంశాలపై కూడా మోక్షజ్ఞ దృష్టి పెట్టినట్లుగా నందమూరి ఫ్యామిలీ సభ్యులు చెబుతున్నారు.యువ హీరోల్లో స్టార్‌ హీరో అనిపించుకోవాలంటే బాగా కష్టపడాలని ఇప్పటికే తెలుసుకున్నట్లున్నాడు మోక్షజ్ఞ.

అందుకే అన్ని విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నాడు.ఈ నందమూరి హీరోను వెండి తెరపై చూడాలంటే మరో రెండు సంవత్సరాలు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube