మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమం తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు.
షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్ లో ఎడిటింగ్ జరుపుకుంటుంది.అయితే అనుకోని విధంగా ఓరోజు తెలుగు ప్రేమం ఎడిటింగ్ జరుగుతున్న సందర్భంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆ సినిమా ఎడిటింగ్ రూంలో వెళ్లి అక్కడ వారికి షాక్ ఇచ్చాడు.
చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో మనమంతా సినిమాలో నటిస్తున్న మోహన్ లాల్ ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పేందుకు ప్రసాద్ ల్యాబ్ కు వెళ్లారు.అది ముగించుకుని పక్క సూట్ లో తెలుగు ప్రేమం ఎడిటింగ్ జరుగుతుంది అని తెలుసుకుని అక్కడికి వెళ్లారట.
కాసేపు ఆ సినిమా దర్శకుడు చందు మొండేటితో ముచ్చటించి వెళ్లారట మోహన్ లాల్.సో అలా మొత్తానికి మోహన్ లాల్ సర్ ప్రైజ్ విజిట్ తో ప్రేమం చిత్రయూనిట్ అంతా షాక్ అయ్యారన్నమాట.