వైభవంగా జరిగిన మనోజ్‌ పెళ్లి

మంచు హీరో మనోజ్‌ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.గత వారం రోజులుగా మంచు వారి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది.

 Manchu Manoj Marriage With Pranathi At Hitech City-TeluguStop.com

నేడు హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌లో అతిరథ మహారథుల సమక్షంలో మంచు మనోజ్‌, ప్రణతిల వివాహం జరిగింది.సరిగా ముహూర్త సమయం అయిన 9 గంటల 10 నిమిషాలకు వేద మంత్రాల నడుమ ప్రణతి మెడలో మనోజ్‌ మంగల సూత్రంను కట్టాడు.

మనోజ్‌ అక్క మంచు లక్ష్మి మరియు ఇతర కుటుంబ సభ్యులు దగ్గరుండి ఈ వివాహ కార్యక్రమ ఘట్టాన్ని నిర్వహించాడు.

ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగంకు చెందిన వందలాది మంది సెలబ్రెటీలు వచ్చారు.

ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు సైతం ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వధించారు.వందల సంఖ్యలో సెలబ్రెటీలు రావడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

దాదాపు 2500 మంది ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్‌లను నియమించినట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube