మనోజ్ పెళ్లి అధికారిక ప్రకటన

మంచు వారి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయంటూ మీడియాలో గత వారం రోజులుగా జోరుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.అయితే ఆ వార్తలపై మంచు ఫ్యామిలీ నుండి అధికారిక స్పందన రాకపోవడంతో కొన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

 Mohan Babu Official Announcement About Manoj’s Marriage-TeluguStop.com

అయితే తాజాగా గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ మోహన్‌బాబు అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది.మోహన్‌బాబు ప్రకటనతో మంచు మనోజ్‌ త్వరలోనే ప్రేమించిన అమ్మాయి ప్రణతిని పెళ్లి చేసుకోబోతున్న విషయం నిజమే అని తేలింది.

మోహన్‌బాబు మనోజ్‌ పెళ్లి గురించి మాట్లాడుతూ.మా పెద్ద కోడలు విరానికా, ప్రణతిలు ఇద్దరు క్లాస్‌మేట్స్.

ఆ విధంగా ప్రణతి కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి.ప్రణతి బిట్స్‌ పిలానీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది.

ఆ తర్వాత న్యూయార్క్‌లో సీపీఎ పూర్తి చేసింది.త్వరలోనే మనోజ్‌, ప్రణతిల పెళ్లి విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దల కూర్చుని మాట్లాడుకోబోతున్నాం అని అన్నారు.

మంచు కుటుంబంలో పెళ్లి వార్తతో ఆ ఫ్యామిలీ ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.పెళ్లి, ఎంగేజ్‌మెంట్‌ డేట్స్‌ను త్వరలో ఖరారు చేసే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube