ప్రభాస్ కులం మీద పడ్డ మోహన్ బాబు

దేశవ్యాప్తంగా .నిజానికి ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 దుమ్మురేపుతోంది.

 Mohan Babu Mentions Prabhas’s Caste At A Wrong Moment-TeluguStop.com

వేయి కోట్ల వైపు పరుగులు పెడుతోంది.తెలుగు, హిందీ, చివరకి ఇంగ్లీష్ క్రిటిక్స్ కూడా పోటిపడి బాహుబలిని పొగుడుతున్నారు.

మన సిని సెలబ్రిటీలు కూడా రాజమౌళి, ప్రభాస్, రానాల కష్టాన్ని మెచ్చుకుంటున్నారు.చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ .ఇలా అందరు తమ ప్రశంసలు తెలిపారు.వీళ్ళందరి మాటలు ఒకలా ఉంటే మోహన్ బాబు మాటలు ఇంకోలా ఉన్నాయి.అసలు బాహుబలి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభాస్ కులం గురించి ఎందుకు మాట్లాడాల్సివచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు.

“బావా బాహుబలి.పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు.ఇప్పుడు ప్రపంచాన్నే ‘రాజులు’ పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు.నా సంతోషానికి అవధుల్లేవు.మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను.

ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను.ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను.విజయీభవ” అంటూ మోహన్ బాబు ప్రభాస్ మీద ట్వీట్స్ పెట్టారు.

మొదట, అసలు ప్రభాస్ మోహన్ బాబు ఏ వరసలో బావ అవుతాడు ? రెండు, ప్రభాస్ కులాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది ? ఈ ట్విట్స్ నేషనల్ మీడియా దాకా వెళితే ఇంకేమైనా ఉందా, మళ్ళీ తెలుగు వాళ్ళు కులానికి ఇచ్చే ముఖ్యత గురించి పెద్ద లెక్చర్ మొదలుపెడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube