మూడో పదం జోడించిన బబ్బర్‌

తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్నవారికి సమస్యాపూరణం గురించి తెలుసు.కవి పద్యంలోని రెండు లైన్లు చెప్పి ఊరుకుంటాడు.

 Modi Running A Government Of ‘suit, Boot And Loot’-TeluguStop.com

సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నవారు మిగతా రెండు లైన్లు (పాదాలు) పూరిస్తారు.విమర్శను కూడా ఈవిధంగా పూరించవచ్చని సినిమా నటుడు, కాంగ్రెసు నాయకుడు రాజ్‌ బబ్బర్‌ చూసి నేర్చుకోవచ్చు.

కొన్ని రోజుల క్రితం కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీని ‘సూట్‌ బూట్‌కీ సర్కార్‌’ అని విమర్శించారు.అంటే ఇది ధనికులకు, కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వమని అర్థం.

రాహుల్‌ విమర్శకు రాజ్‌ బబ్బర్‌ మరో పదం జోడించారు.సూట్‌,బూట్‌ పక్కన ‘లూట్‌’ అని చేర్చారు.

లూట్‌ చేయడమంటే దోచుకోవడమని అర్థం.మోదీ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం తనను తాను పొగుడుకుంటుంటే, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

బబ్బర్‌ మరో విమర్శ కూడా చేశారు.మోదీ ప్రధాన మంత్రి మాత్రమే కాదని, ‘పరిధాన్‌ మంత్రి’ అని విమర్శించారు.

అంటే డ్రస్‌ మినిస్టర్‌ అని అర్థం.అంటే మోదీకి వస్ర్తధారణ మీద మోజు ఎక్కువని బబ్బర్‌ అభిపాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube