సెల్ ఫోన్ దరలకు రెక్కలొచ్చాయి!!!

సామాన్య మానవుడు నుంచి.సంపన్నుల వరకు…అందరి దగ్గర దొరికే ఒకే ఒక వస్తువు ఏది అంటే.

 Cell Phone Prices Will Increase Soon-TeluguStop.com

ఠక్కున చెప్పే సమాధానం “సెల్ ఫోన్” అయితే.ప్రజా జీవితంలో ఒక భాగంగా మారిపోయిన ఈ సెల్ ఫోన్ దరలు మళ్లీ చుక్కల్ని తాకే అవకాశం కన్పిస్తుంది అంటున్నాయి మార్కెట్ వర్గాలు.

ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్లపై వ్యాట్‌ను పెంచాలని సీమాంధ్ర ప్రభుత్వం ఈ మేరకు ఒక నిర్ణయాన్ని చేసినట్లు సమాచారం.ఇక ఇప్పటికే సీమాంధ్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 4 రూపాయల చొప్పున పెంచింది.కొన్ని రాష్ట్రాలు వ్యాట్ రూపంలో సెల్ ఫోన్లపై 14.5 శాతం వసూలు చేస్తూ రెవన్యూను వసూలు చేసుకుంటున్నాయి.ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని సెల్ ఫోన్లపై వ్యాట్‌ను పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అయితే, ఆ వ్యాట్ 4,5 శాతం మాత్రమే ఇప్పటి వరకు ఉంది.

దీనికి సంబంధించి ప్రతిపాదనలను పంపించాలని ఎపి ఆర్థిక శాఖ వాణిజ్య పన్నుల శాఖకు సూచించింది.సెల్‌ఫోన్లపై వ్యాట్‌ను పది శాతం వరకు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.అయితే, పేదలకు కొంత ఊరట కలిగించే విధంగా ఆ వ్యాట్‌ను పెంచాలని అనుకుంటోంది.10 వేల రూపాయల పైబడి ఖరీదు చేసే సెల్‌ఫోన్లపై మాత్రం వ్యాట్ పెంచాలని అనుకుంటోంది.అయితే, దీనివల్ల అదనంగా ఎంత ఆదాయం సమకూరుతుందనే ఆంచనా ప్రభుత్వానికి ఇప్పటి వరకు లేదు.మధ్యతరగతి ప్రజలు, పేదలు పది వేల రూపాయల లోపు ఖరీదు చేసే ఫోన్లను మాత్రమే కొంటారని, అందువల్ల వ్యాట్ పెంచడం వల్ల పేదలపై, మధ్యతరగతిపై భారం పడే అవకాశం లేదని అధికార వర్గాలు అంటున్నాయి.

ఇక దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.మరి ఇంకెందుకు ఆలస్యం.సెల్ ఫోన్ కోనేవారు.త్వరగా కొనేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube