మొబైల్ బ్యాటరి రోజంతా ఆగాలంటే ఈ 10 చిట్కాలు పాటించండి

మొబైల్ బ్యాటరీ ఎంతసేపు పని చేస్తుంది అనే విషయం ఆ మొబైల్ బ్యాటరి యొక్క mAh వాల్యూ మీదే ఆధారపడి ఉంటుంది.కాని కేవలం దానిపైనే కాదు.

 Mobile Battery Should Last Whole Day ? Follow These 10 Tips-TeluguStop.com

అది మాగ్జిమం లిమిట్.మన వాడకాన్ని బట్టి కూడా ఉంటుంది.4500 mAh బ్యాటరీ ఫోన్ పెద్ద గేమర్ చేతిలో పెట్టండి .ఓ పూటలో మొత్తం ఖాళి చేసి ఇచ్చేస్తాడు.అందుకే వాడకం ప్రభావం ఉంటుంది అని చెప్పేది.కాబట్టి ఈ పది చిట్కాలు పాటించి మీ బ్యాటరి రోజంతా ఆగేలా చూసుకోండి.

* బ్రైట్ నెస్ తగ్గించండి.మొబైల్ లైట్ చాలా అంటే చాలా బ్యాటరి లాగేస్తుంది.

సాధ్యమైనంతవరకు తక్కువ లైట్ ఉండేలా చూసుకొండి.ఆటో బ్రైట్ నెస్ ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలక్ట్ చేసుకోండి.

* బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ని ఆపేయండి.ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆండ్రాయిడ్ ని రన్ చేసే యాప్స్ ని మాత్రం వదిలేయండి.

మిగితా ఏ యాప్ అయినా సరే, బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవ్వాల్సిన అంత అవసరం ఉండదు.

* GPS ఆన్ చేసి ఉన్నట్లయితే చాలా బ్యాటరీ పోతుంది.

లొకేషన్ సర్వీసెస్ అందించే ఆప్షన్స్ అన్ని ఆపేసి ఉంచితే మంచిది.అలాగో అవసరం పడినప్పుడు అవి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయొచ్చు.

* కీ పాడ్ కి కూడా కొనరు వైబ్రేషన్ పెట్టుకొని ఉంటారు.ఇది నిజంగా అనవసరపు ఆప్షన్.దానికే కాదు, రీబూట్ మినహాయిస్తే ఇంకే ఆప్షన్ లో కూడా వైబ్రేషన్ ఆన్ లో లేకుండా చూసుకోండి.

* ఇప్పుడు ఉన్న బ్యాటరీలు ఎక్కువసేపు చార్జ్ చేయకపోతేనే మంచిది.

కాబట్టి రాత్రుళ్ళు చార్జిన్ చేసి అలానే పెట్టేసి పడుకోకండి.ఇక ఫుల్ చార్జ్ చేసినా ఒకే కాని 20% కిందికి బ్యాటరి పడిపోకుండా చూసుకోండి.

* స్క్రీన్ టైం అవుట్ చాలా అంటే చాలా తక్కువ, అంటే మినిమం వాల్యూలో పెట్టుకోండి.ఫోన్ ని తక్కువగా ఉపయోగించేవారికి ఈ ఆప్షన్ చాలా లాభపడుతుంది.

ఫోన్ ఎక్కువ వాడే అలావాటు ఉన్నా సరే, స్క్రీన్ టైం అవుట్ తక్కువ పెట్టండి.

* గేమ్స్ వద్దు.

కంప్యూటర్ లో గేమ్స్ ఆడేది సరిపోదా.బ్యాటరీ కావాలంటే మాత్రం గేమ్స్ వద్దు.

అందులో హై జీపుయూ గేమ్స్, ఎక్కువ స్టోరేజ్ తీసుకునే గేమ్స్ వద్దు.ఇలాంటి ఆటలు కంప్యూటర్ లోనే ఆడుకోండి.

* ప్రతి యాప్ నోటిఫికేషన్ యాక్సెస్ ఇవ్వకండి.లేదంటే నోటిఫికేషన్స్ ఆ తరువాతైనా టర్న్ ఆఫ్ చేసుకోండి.

వాట్సాప్ ఒక్కదానికి నోటిఫికేషన్ యాక్సెస్ ఇస్తే సరిపోతుంది కదా.

* ఫేస్ బుక్, ఫేస్ బుక్ మెసెంజర్, ట్విట్టర్ .చాలా ఎక్కువ బ్యాటరి తాగేసే యాప్స్ ఇవి.కాబట్టి వీటి లైట్ వెర్షన్స్ వాడండి.ట్విట్టర్ కి అయితే ఓ సూపర్ లైట్ వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది.ఫేస్ బుక్ లైట్ వెర్షన్ అంత ఆకర్షణీయవంతంగా లేదు కాని, బ్యాటరి కావాలంటే తప్పదు.

* ఫోన్ యొక్క టెంపరేచర్ తక్కువ ఉండేలా చూసుకుంటే, రోజంతా ఈజీగా ఆగుతుంది బ్యాటరి.ఈకాలంలో టెంపరేచర్ చెక్ చేసే ఆప్షన్స్ ఫోన్లోనే వస్తున్నాయి.కొట్టగా యాప్స్ అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube