Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

మొబైల్ బ్యాటరి రోజంతా ఆగాలంటే ఈ 10 చిట్కాలు పాటించండి-Mobile Battery Should Last Whole Day ? Follow These 10 Tips

మొబైల్ బ్యాటరీ ఎంతసేపు పని చేస్తుంది అనే విషయం ఆ మొబైల్ బ్యాటరి యొక్క mAh వాల్యూ మీదే ఆధారపడి ఉంటుంది. కాని కేవలం దానిపైనే కాదు. అది మాగ్జిమం లిమిట్. మన వాడకాన్ని బట్టి కూడా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ ఫోన్ పెద్ద గేమర్ చేతిలో పెట్టండి .. ఓ పూటలో మొత్తం ఖాళి చేసి ఇచ్చేస్తాడు. అందుకే వాడకం ప్రభావం ఉంటుంది అని చెప్పేది. కాబట్టి ఈ పది చిట్కాలు పాటించి మీ బ్యాటరి రోజంతా ఆగేలా చూసుకోండి.

* బ్రైట్ నెస్ తగ్గించండి. మొబైల్ లైట్ చాలా అంటే చాలా బ్యాటరి లాగేస్తుంది. సాధ్యమైనంతవరకు తక్కువ లైట్ ఉండేలా చూసుకొండి. ఆటో బ్రైట్ నెస్ ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలక్ట్ చేసుకోండి.

* బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ని ఆపేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆండ్రాయిడ్ ని రన్ చేసే యాప్స్ ని మాత్రం వదిలేయండి. మిగితా ఏ యాప్ అయినా సరే, బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవ్వాల్సిన అంత అవసరం ఉండదు.

* GPS ఆన్ చేసి ఉన్నట్లయితే చాలా బ్యాటరీ పోతుంది. లొకేషన్ సర్వీసెస్ అందించే ఆప్షన్స్ అన్ని ఆపేసి ఉంచితే మంచిది. అలాగో అవసరం పడినప్పుడు అవి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయొచ్చు.

Continue Reading
More Posts
To Top