ఏపీలో 7వ ఎమ్మెల్సీ సీటుపై బాబు-జ‌గ‌న్ టెన్ష‌న్‌

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారుచేసిన సీఎం చంద్ర‌బాబు.ఇప్పుడు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాల‌పై దృష్టిపెట్టారు.

 Mlc Seat Tension In Chandrababu-jagan-TeluguStop.com

మొత్తం ఏడు స్థానాలు ఖాళీ అవుతున్న నేప‌థ్యంలో.టీడీపీకి ఇప్పుడు ఐదు ప‌క్కాగా వ‌స్తాయి.

వైసీపీకి ఒక‌టి ద‌క్కుతుంది.

ఇప్పుడు అంద‌రి దృష్టి ఏడో స్థానంపై ప‌డింది.

అటు టీడీపీకి గానీ, ఇటు వైసీపీకి గాని మెజారిటీ లేదు.కానీ రెండు పార్టీలు అభ్య‌ర్థిని నిలిపేందుకు స‌న్నాహాలు ప్రారంభించాయి.

బ‌ల‌మైన అభ్య‌ర్థుల వేట‌లో ప‌డ్డాయి.అంతేగాక వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి.

ఎమ్మెల్యేల కోటాలో ఏడో ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవ‌రు ద‌క్కించుకుటారా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం అసెంబ్లీలో 175 ఎమ్మెల్యేలు – ఓ నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలుపుకుని మొత్తం 176 మంది ఎమ్మెల్యేలున్నారు.ఆయా అభ్యర్థులు గెలిచేందుకు 25.5 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాలను పరిశీలిస్తే… టీడీపీకి 128(వైసీపీతో వ‌చ్చిన 21 మందితో క‌లిపి) మంది ఎమ్మెల్యేల బలం ఉంది.ఇక వైసీపీకి సభలో 46 మంది ఎమ్మెల్యేలున్నారు.

ఈ లెక్కన చూసుకుంటే… ఎన్నికలు జరుగుతున్న ఏడు స్థానాల్లో 5 స్థానాలు టీడీపీకి – ఓ స్థానం వైసీపీకి దక్కుతాయి.మ‌రి ఇంకో సీటు ఎవ‌రిక‌నేదే స‌స్పెన్స్‌!!

ఈ విష‌యంలో అటు టీడీపీ, వైసీపీలోనూ తీవ్రంగా పోటీ నెల‌కొంది.

ప్ర‌తిప‌క్షంలోని కొంత‌మంది ఎమ్మెల్యేలు కూడా మ‌ద్ద‌తు ఇచ్చే అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు.వైసీపీ నుంచి వ‌చ్చిన అభ్య‌ర్థిని నిల‌బెడితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేయ‌వ‌చ్చని, దీని ద్వారా ఏడో సీటు ద‌క్కించుకోవ‌చ్చనేది బాబు వ్యూహం.

అలాగే తన టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో కొంతమంది ఓట్లైనా తమకు రాకపోతాయా అన్న భావనతో వైసీపీ ఏడో స్థానానికి పోటీ చేయాలని భావిస్తోంది.మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఏడో స్థానానికి ఎవ‌రు గెలుస్తారో ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌గానే ఉన్నా.

ఎవ‌రి వ్యూహాల్లో వారు మునిగితేలుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube