వైకాపాలో ఎమ్మెల్సీ చిచ్చు..!

ఏపీ ఏకైక విప‌క్షం వైకాపాకి శాస‌న స‌భ స‌భ్యుల సంఖ్య ఆధారంగా ఒక ఎమ్మెల్సీ సీటు ల‌భించ‌నుంది.శాస‌న స‌భ స‌భ్యుల ప‌క్షాన మండ‌లికి ఒకరిని పంచే ఛాన్స్ ఈ పార్టీకి లభించ‌నుంది.

 Mlc Seat Selection In Ycp-TeluguStop.com

మార్చిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో వైకాపా త‌ర‌ఫున ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌.ఒక‌రికి ఛాన్స్ ఇవ్వ‌నున్నారు.

పైకి ఇలా చెప్పుకోడానికి ఎంతో బాగానే ఉన్న‌ప్ప‌టికీ.వైకాపాలో మాత్రం అంత‌ర్గ‌తంగా ఈ విష‌యం తీవ్ర వేడి పుట్టిస్తోంది! ఉన్న‌ది ఒక్క సీటు కావ‌డం.

ఆశావ‌హులు హేమా హేమీలు కావ‌డంతో ఎవ‌రిని మండ‌లికి పంపించాలో జ‌గ‌న్‌కు అగ్నిప‌రీక్షగా మారింది.ఎవ‌రిని కాద‌ని ఎవ‌రిని పంపినా.

అది చివ‌రికి ఆయ‌న మెడ‌కే వ్య‌తిరేక‌త రూపంలో చుట్టుకునే ప్ర‌మాదం మాత్రం పొంచి ఉంద‌ని అంటున్నారు.

ఈ ఒక్క సీటు కోసం దాదాపు 10 మందిపైగా సీనియ‌ర్ మోస్ట్ లీడ‌ర్లు కాచుకుని ఉన్నారు.

అధికార ప్ర‌తినిధులుగా ఎప్ప‌టి నుంచో త‌మ వాయిస్‌ను బ‌లంగా వినిపిస్తున్న అంబ‌టి రాంబాబు, వాసిరెడ్డి ప‌ద్మ‌ల నుంచి కాంగ్రెస్ నుంచి వైకాపాలోకి జంప్ చేసిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, కొలుసు పార్థసారథి, భూమన కరుణాకర్ రెడ్డి వంటి పెద్ద నేత‌ల‌ వ‌ర‌కు భారీ సంఖ్య‌లో ఈ ఎమ్మెల్సీ సీటుపై క‌న్నేశారు.దీనికితోడు ఆయా నేత‌లు వైకాపా తీర్థం పుచ్చుకుంటున్న స‌మ‌యంలో జ‌గ‌న్ నుంచి ఈ మేర‌కు హామీ కూడా పొందార‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలోనే ఉన్న ఒక్క సీటు కోసం నేత‌లు జ‌గ‌న్‌పై విప‌రీత‌మైన ఆశ‌లు పెట్టుకున్నార‌ని తెలుస్తోంది.

ఇదిలావుంటే, ఇదే విష‌యంలో మ‌రిన్ని ఆశ‌లు పెట్టుకున్నార‌ని భావిస్తున్న జ‌గ‌న్ స‌న్నిహితుడు బాలినేని శ్రీనివాస్ విష‌యం ఇప్పుడు మ‌రింత‌గా చ‌ర్చ‌కు దారితీస్తోంది.

త‌న‌ను మండ‌లికి పంపి తీరాల్సిందేన‌ని బాలినేని ప‌ట్టుప‌డుతున్నార‌ట‌.అంతేకాదు, ఒక‌వేళ.

త‌న‌ను మండ‌లికి పంప‌క‌పోతే.పార్టీ నుంచి వెళ్లిపోతాన‌ని కూడా ఆయ‌న బెదిరింపుల‌కు దిగుతున్న‌ట్టు స‌న్నిహిత వ‌ర్గాల క‌థ‌నం.

ఇదే జ‌రిగితే.మరో రెండు సంవ‌త్స‌రాల్లో అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల విష‌యంలో వైకాపా తీవ్రంగా న‌ష్టపోయే ప్ర‌మాదం ఉంద‌ని ఈ వ‌ర్గం చెబుతోంది.

ఈ క్ర‌మంలో బాలినేనిని మండ‌లికి పంపితే.ఎన్నాళ్లుగానో జ‌గ‌న్ పార్టీని న‌మ్ముకుని ఎదురు చూస్తున్న వాసిరెడ్డి, అంబ‌టి లాంటి వాళ్లు ఉసూరు మంటార‌ని, గ‌తంలోనే వాసిరెడ్డి.

త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కింద‌ని ఇప్పుడు కూడా ఆమెను నిరుత్సాహ‌ప‌రిస్తే.ఆమె దారి ఆమె చూసుకునే ప్ర‌మాదం ఉంద‌ని ఇది కూడా అంతో ఇంతో పార్టీపై ప్ర‌భావం చూప‌డంతోపాటు అధికార ప‌క్షం టీడీపీకి విమ‌ర్శించేలా మ‌రో కొత్త అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు.

ఇదంతా ఇలా ఉంటే, కొలుసు, ధ‌ర్మాన వంటి వారిని ప‌క్క‌న‌పెట్టినా.ప‌రిస్థితి ఇబ్బందేన‌ని మ‌రో వ‌ర్గం చెబుతోంది.

వీరంతా సీనియ‌ర్లుగా జ‌గ‌న్ పంచ‌న చేరార‌ని, వీరిని ప‌ట్టించుకోక‌పోతే.యాంటీ ప్ర‌చారం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

మ‌రి ఇన్ని కూడిక‌లు, తీసివేత‌లు చుట్టుముట్టిన ఈ ఒక్క ఎమ్మెల్సీ సీటు విష‌యంలో జ‌గ‌న్ ఏవిధంగా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube