Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఇద్ద‌రు ఏపీ మంత్రుల‌పై లైంగీక ఆరోప‌ణ‌లు-Mla Roja Harsh Comments On Two Ap Ministers

ఏపీ సీఎం చంద్ర‌బాబుతో పాటు టీడీపీ ప్ర‌భుత్వాన్ని, మంత్రుల‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేస్తోన్న వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా మ‌రోసారి ఏపీ స‌ర్కార్‌తో పాటు మంత్రుల‌పై తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయారు. త‌న‌దైన స్టైల్లో సినీ మార్క్ డైలాగుల‌తో రోజా అటు చంద్ర‌బాబును, ఇటు మంత్రుల‌ను ఏకి ప‌డేసింది. రోజా కాంట్ర‌వ‌ర్సీ లాంగ్వేజ్‌పై ఎన్ని విమ‌ర్శ‌లు వస్తున్నా ఆమె మాత్రం త‌న తీరు అస్స‌లు మార్చుకోవ‌డం లేదు.

బాబు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న ఇద్ద‌రిపై లైంగీక వేధింపులు కేసులు ఉన్నాయ‌ని రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. లైంగీక ఆరోప‌ణ‌ల వేధింపులు ఉన్న ఈ ఇద్ద‌రు మంత్రుల‌ను చంద్ర‌బాబు అండ్ కో వెన‌కేసుకు రావ‌డంలో ఆంత‌ర్యం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఏపీలో సూదిగాళ్ల పాల‌న సాగుతోంద‌ని బాబు ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన ఆమె త‌న పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణే క‌ల్పించ‌లేని రోజా ఏ ముఖం పెట్టుకుని రాఖీ క‌ట్టించుకుంటార‌ని విరుచుకుప‌డింది.

Continue Reading
More Posts
To Top