స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి

వస్తువు కొనడం కాదు, దాన్ని కాపాడుకోవడం గొప్ప అని చెబుతుంటారు పెద్దలు.కొనడం ఎందుకు గొప్ప కాదు అనే వాదన ఎందుకు కాని, కాపాడుకోవడం మాత్రం నిజంగా గొప్ప విషయమే.

 Mistakes You Shouldn’t Do With Your Smart Phone-TeluguStop.com

ఎందుకంటే ఆ వస్తువు పట్ల పూర్తి అవగాహన ఉంటే తప్ప దాన్ని కాపాడుకోలేం.ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉండటం చాలా సాధారణ విషయమే.

కాని దాన్ని కొన్ని ప్రమాదాల నుంచి కాపాడుకోవడం కూడా నేర్చుకోవాలి.మీ ఫోన్స్ సెక్యూర్డ్ గా ఉండాలంటే ఈ తప్పులు మాత్రం చేయొద్దు.

* 90% ఫోన్లలో ప్రీ ఇంస్టాల్డ్ అంటివైరస్ ఉండదు.కాబట్టి ఫోన్ కొన్న వెంటనే మర్చిపోకుండా ఆంటివైరస్ ఇంస్టాల్ చేయాలి.

యాంటి వైరస్ లేకపోతే తాళం వేయని ఇంటిలో నిద్రపోతున్నట్లే.ఎప్పుడు ఏ వైరస్ అటాక్ చేస్తుందో చెప్పలేం.

* స్టోర్ నుంచి కాకుండా బయట నుంచి ఏపికే ఫైల్స్ డవున్లోడ్ చేస్తే ఇంస్టాల్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.ఈ యాప్ ఏ కంపెని చేసింది? ఆ కంపెనీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అని తెలుసుకోని, నమ్మదగిన కంపెనీ అయితేనే ఇంస్టాల్ చేయండి.

* పబ్లిక్ వైఫై నెట్వర్క్స్ కి మీ ఫోన్ ని కనెక్ట్ చేయకపోవటమే మంచిది.హ్యాకింగ్ చేయాలనుకునే వారు ఎక్కువగా ఈ పబ్లిక్ నెట్వర్క్స్ తో బురిడి కొట్టించాలని ప్రయత్నిస్తుంటారు.

* యాప్స్ కాని, సిస్టమ్ అపడేట్స్ కాని వస్తే పట్టించుకోకుండా వదిలేయకండి.కిందటి వెర్షన్ లో ఉన్న ఎర్రర్స్ తీసేసే కొత్త అప్డేట్స్ ఇస్తుంటారు.

* అవసరం ఉంటే తప్ప బ్లూటూత్ ఆన్ చేయొద్దు.హ్యాకర్స్ బ్లూటూత్ ఆన్ లో ఉన్న ఫోన్ జాడ ఈజీగా పట్టేస్తారు.

* పె పల్, ఈబే, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ .ఇలాంటి యాప్స్ లేదా సైట్స్ లో మీ డెబిట్ , క్రెడిట్ కార్డ్స్ సేవ్ చేసుకుంటే చేసుకున్నారు కాని, పని పూర్తయ్యాక లాగౌట్ చేయడం మర్చిపోకండి.

* ఇక అతిముఖ్యమైనది .ఏ లింక్ పడితే ఆ లింక్ మీద క్లిక్ చేయకండి.కోటి రూపాయలు వచ్చాయి, పదివేల ఫోను వేయి రూపాయలకే లాంటి బంపర్ ఆఫర్లు మీకు ఊరికే ఎవరు ఇవ్వరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube