Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

చంద్ర‌బాబునే బెదిరిస్తోన్న మంత్రి ..!-Minister Warning To CM Chandrababu

ఏపీ రాజ‌కీయాల్లో సీఎం చంద్ర‌బాబును మించిన సీనియ‌ర్ లేరు! ఆయ‌న పేరు వింటే పార్టీలో అంద‌రికీ భ‌యం! కానీ తొలిసారి ఎమ్మెల్యే అయి.. మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న ఒక ఆయ‌న మాత్రం చంద్ర‌బాబును అస్స‌లు లెక్క చేయ‌డం లేదు. నిత్యం వివాదాల‌తో పెన‌వేసుకునే ఆయ‌న‌.. ఇప్పుడు పార్టీ అధినేత మాట‌నే ధిక్క‌రిస్తున్నారు. చంద్ర‌బాబు అంటే ఏమాత్రం అదురూబెదురూ లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇంకో ఆస‌క్తిక‌ర అంశమేంటంటే.. చంద్ర‌బాబునే బెదిరిస్తున్నార‌ట‌. విష‌యం తెలిసిన ఆయ‌న గాడ్ ఫాద‌ర్ కూడా.. `ఈయ‌న‌కా ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వ‌మ‌ని అభ్య‌ర్థించింది` అని తెగ బాధ‌ప‌డుతున్నార‌ట‌.

2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. తెలుగుదేశం పార్టీ ఆయనకు పిలిచి ఎమ్మెల్యే సీటు ఇచ్చింది. ఇంకేముంది మనోడి దశ తిరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన మనోడికి కులం కోటా కలసి రావడంతో మంత్రి కూడా అయ్యారు. మంత్రి అయ్యాక సొంత పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకుండా ప్రత్యర్థి పార్టీపై అభిమానం చూపారు. అంతేగాక నిత్యం వివాదాల‌ను వెంటబెట్టుకుని తిరిగారు. ఈయ‌నే ఒక ర‌కం అనుకుంటే.. ఇక ఆయ‌న కొడుకులు కూడా తండ్రికి త‌గ్గ వారే! అధినేత ఎన్నిసార్లు మంద‌లించినా.. ప‌ద్ధ‌తి మాత్రం మార‌లేదు!

దీంతో సీఎం చంద్రబాబు నుంచి మరోసారి మంత్రి గారికి శ్రీముఖం అందింది. వెంటనే తన వద్దకు రావాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించకుండా ఎప్పుడో తనకు ఇష్టమైన రోజు వెళ్లి ముఖ్యమంత్రికి కనిపించారు. ‘ఇలా అయితే ఎలా? నీ పదవి వెంటనే ఊడ‌బీకేస్తా! నిన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయిస్తాను` అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. దీనికి మంత్రి కూడా తీవ్ర స్థాయిలో స్పందించారట. ‘నన్ను మంత్రి పదవి నుంచి తొలగించిన గంటలో నీ పదవి ఊడిపోతుంది. నా గురించి తెలియదు. నేను తలచుకుంటే ఇప్పుడే ప్రభుత్వాన్ని పడగొడతా. నా వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను ఊ అంటే ప్రభుత్వం పడిపోతుంది` అని మంత్రి హెచ్చరించారట.

దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఆ పనేదో చేసుకోవచ్చు కదా..ఇక్కడ ఉండడం దేనికి అని మంత్రిని అక్కడ నుంచి తరిమేశారట. టీడీపీలో ఆ మంత్రికి గాడ్‌ ఫాదర్‌గా వ్యవహరించిన వ్యక్తి కూడా ఈ విషయాలను అంగీకరిస్తున్నారు. ఇటువంటి వ్యక్తినా రికమెండ్ చేశాన‌ని ఫీల‌వుతున్నార‌ట‌. మ‌రి ఆ మంత్రిపై చంద్ర‌బాబు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటారో ఏమో! వేచిచూడాల్సిందే!!

Continue Reading

More in Telugu News

 • HEALTH TIPS

  Remember these things before masturbating

  By

  హస్తప్రయోగం చాలా మంచి అలవాటు. ఈ జెనరేషన్ కానివాళ్ళకి నచ్చకపోవచ్చు, మతపెద్దలు అసహ్యించుకోవచ్చు కాని, సైన్స్ గురించి నాలుగు ముక్కలు తెలిసినా...

 • NEWS

  Lokesh Contesting From Kuppam… Chandrbabu from Gudivada

  By

  ఏసీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు రాజ‌కీయ ఎంట్రీపై ఎప్ప‌టి నుంచో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. లోకేశ్ ముందు ఎమ్మెల్సీ అవుతారా ?...

 • Good timings for water intake

  By

  రోజుకి ఇన్నిసార్లు మంచినీళ్ళు తాగాలని ఏ శాస్త్రవేత్త చెప్పలేడు. ఎంత తాగాలి అనే విషయం మీద మాత్రం క్లారిటి ఉంది. మగవారైతే...

 • NEWS

  Janasena survey on 2019 Elections

  By

  ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో ఎంత వ‌ర‌కు ప్ర‌భావం చూపుతుంది అన్న అంశంపై అప్పుడే ర‌క‌ర‌కాల అంచ‌నాలు స్టార్ట్ అయ్యాయి....

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..