పాలిటిక్స్ కి అధికారపక్ష మంత్రి గుడ్ బై..రీజన్ ఎవరో తెలుసా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు గారు హయాం నుంచీ టిడీపిని అంటిపెట్టుకుని ఉన్న నేత ప్రస్తుత ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై సీఎం చంద్రబాబు తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారని .సీనియర్ నాయకుడైన ఆయనని అస్సలు పట్టించుకోవడం లేదని.

 Minister Says Goodbye To Politics-TeluguStop.com

ఆయన ప్రాభల్యం తగ్గించేలా స్కెచ్ లు వేసున్నారని.ఎంతో సీనియర్ నాయకుడిని అయిన నన్ను డమ్మీ చేస్తునారని కేఈ.కృష్ణమూర్తి స్వయంగా తన సన్నిహితుల వద్ద వాపోతున్నారని టాక్.చంద్రబాబు నాయుడు తరువాత ప్లేస్ లో ఉన్న కృష్ణమూర్తి ఈ విషయంలో పూర్తి అసహనంలో ఉన్నారని తెలుస్తోంది.



రెవెన్యూ మంత్రిగా ఉన్న కేఈని కాదని బాబు త‌న‌కు న‌మ్మక‌స్తుడు అయిన పుర‌పాల‌క శాఖా మంత్రి నారాయ‌ణ‌కు కీల‌క‌మైన సీఆర్‌డీఏ బాధ్యత‌ల‌ను అప్పగించారు.కేఈ కి తెలియకుండానే ఆయన శాఖలో బ‌దిలీలు జ‌రిగిపోయేలా ప్రభుత్వం గ‌తంలో తెచ్చిన ఆర్డినెన్స్ కూడా కేఈని బాబు ఎలా లైట్ తీస్కొంటున్నారో అంద‌రికి తెలిసేలా చేసింది.

నాడు లోకేష్ ఒత్తిడి తెచ్చి మ‌రీ కేఈ ఆర్డీవోల‌ను బ‌దిలీ చేస్తే వాటిని ర‌ద్దు చేసేలా డెసిష‌న్ తీసుకున్నార‌న్నది కూడా ఓపెన్ సీక్రెట్టే.ఇలా బాబు వ‌ద్ద ఎన్నోసార్లు అవ‌మానాల‌కు గుర‌వుతూ వ‌స్తోన్న కేఈ ఇప్పుడు బాబు వ‌ద్ద త‌న అవ‌మానాల‌పై త‌న స‌న్నిహితుల ముందు ఓపెన్ అయిపోతున్నార‌ట‌.

ఇది ఇలా ఉంటే కేఈ తమ్ముడి కొడుకు కేఈ ప్రభాకర్.ఈ మధ్య చేస్తున్న హడావిడి చంద్రబాబు ని ఇబ్బంది పెడుతోందట.వైసీపీ నుంచి వచ్చిన నేతల వలన జిల్లలో తమ ప్రాభల్యం తగ్గుతోంది అని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న నేరుగా చంద్రబాబుపై ఇటీవ‌ల కొన్ని కీల‌క విమ‌ర్శలు చేశారు.

అయితే ఈ విషయంలో ప్రభాకర్ ని ఒక్క మాటకూడా కృష్ణమూర్తి అనకపోవడం తో బాబు కేఈ పై అస‌హ‌నంతో ఉన్నార‌ని టాక్.

సామాన్యంగానే బాబుకి ఎవరైనా ఎదురు చెప్తే నచ్చదు దాంతో ఆ కేఈ ని పక్కన పెట్టే పనిలో పడ్డారట బాబు… ప్రస్తుతం సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో కి వెళ్ళే ముందు పాలనా సవ్యంగా సాగడానికి ఐదుగురు మత్రులతో ఒక కమిటీ వేశారు దాంట్లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు మంత్రులు కళా వెంకట్రావు, నారా లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, కాలువ శ్రీనివాసులకు చోటు కల్పించారు కానీ, కేఈని ప‌క్కకు పెట్టడం ఆయ‌న అస్సలు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఈ పరిణామాలతో ఖంగుతిన్న కేఈ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను త‌ప్పుకుని త‌న కుమారుల‌ను రంగంలోకి దింపాల‌ని ఆలోచిస్తున్నారట ఒకవేళ చంద్రబాబు కేఈ కుమారులకి అవకాశం ఇవ్వకపోతే పార్టీ ఏమి చేయాలనే దానిపై ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందొ కానీ ఇప్పుడు పొలిటికల్ వర్గాలలో ఇది చర్చనీయంసం అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube