టీవీలు అదే పనిగా చూసేవాళ్ళకి షాకింగ్ న్యూస్

మనిషికి నిద్ర…నీళ్ళు త్రాగడం.స్వచ్చమైన గాలి పీల్చుకోవడం ఇలా ఇవన్నీ ఎంత ముఖ్యమో రోజు వ్యాయామం కూడా అంతే అవసరం.

 Middle Aged People Must Fallow Exercise-TeluguStop.com

శరీరానికి శ్రమని ఇవ్వాలి.అలసట రావాలి.

చెమట పట్టకుండా ఉంటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.ఎక్కడికక్కడ కళ్ళు ,చేతులు కుదుటపట్టేస్తాయి.

అంతేకాదు అనేకరకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.అయితే పిల్లలు పెద్దలు కన్నా మధ్య వయస్కులవారు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి ఒక వేళ అలా చేయకపోతే జరిగే పరిణామాలు అనేకం

మిడి వయస్సుగలవారు ప్రతీరోజు క్రమం తప్పకుండ వ్యాయామం చేయాలి.

అలా చేయకుండా చాలా మంది టీవీకి పరిమితమవుతున్నారు.అలా టివీ ముందు కూర్చునే వారి మెదడు పరిమాణం తగ్గిపోతుంది.

అంతేకాదు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు బోస్టన్ యూనివర్శిటీ పరిశోధకులు.ఫిట్‌నెస్‌కు మెదడు పరిమాణానికి మధ్య సంబంధముందని తమ పరిశోధనలో తేలిందని పరిశోధకుడు నికోలీ స్పార్తానో వెల్లడించారు.

అంతేకాదు వారి పరిశోధనల్లో అనేకరకాలైన విషయాలు వెల్లడించారు

40 ఏళ్ల వయసు గల 15వేల మందికి ట్రేడ్ మిల్ టెస్ట్ జరపగా వారిలో వ్యాయామం చేయని వారు హృద్రోగాలు, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారని తేలింది.వ్యాయామం చేయని మధ్యవయసు వారికి ఎమ్మారై చేయించగా వారి మెదడు పరిమాణం తగ్గిందని తేలింది.

అందుకే వ్యాయామం చేయని మధ్యవయసు వారు మెదడు పరిమాణం తగ్గడంతోపాటు పలు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని పరిశోధకులు తేల్చారు.వ్యాయామం చేయకుండా ఎప్పుడు టీవీ లకి అతుక్కు పోతున్నవాళ్ళు ఇప్పటికైనా మేల్కోవాలి అని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube