మీ మొబైల్ కి ఇదే బెస్ట్ డిక్షనరీ

మనలో చాలామందికి ఇంగ్లీషు అర్థాల అవసరం ప్రతీరోజు పడుతుంది.ఇంగ్లీషు మీడియం స్టూడెంటైనా, స్పోకెన్ ఇంగ్లీషు బోధించే మాస్టారైనా, ఇంగ్లీషు ఎవరికి పూర్తిగా రాదు.

 Merriam – The Best Mobile Dictionary-TeluguStop.com

ఎందుకంటే ప్రతీరోజు ఆంగ్లంలో ఎదో ఒక కొత్త పదం పుట్టుకొస్తూనే ఉంది.ఇంగ్లీషు అర్థాల కోసం డిక్షనరి వాడాలి సరే, కాని మంచి కంపెనీల డిక్షనరీ కొందాం అంటే వేలల్లో ఖర్చు పెట్టాలి.

ఇంకెన్ని రోజులు ఈ పుస్తకాలు, స్మార్ ఫోన్ లో డిక్షనరీ వేసుకుంటే సరిపోద్దిగా అని చాలామంది చాలా డిక్షనరీలే డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు.కాని ఎక్కడో అసంతృప్తి.

అర్థాలు తక్కువ ఉండటమో, దాన్ని ఎలా వాడతారో చెప్పకపోవటమో, ఎలా పలకాలో చెప్పకపోవడం చూస్తుంటాం చాలా ఆప్స్ లో.ఇంకొన్ని డిక్షనరీలు ఇంటర్నెట్ ఆన్ చేస్తే తప్పా, పనిచేయవు.

మీ కష్టాలన్నీ చూసే మెర్రియం అనే కంపెని సరికొత్త నిఘంటువు గూగుల్ ప్లే స్టోర్ లో పెట్టేసింది.దాని పేరే ” మెర్రియం – వెబ్ స్టర్ డిక్షనరీ (Merriam – Webster Dictionary)

ఇది ఒక్కసారి డౌన్లోడ్ చేసుకున్నాక ఇంటర్నెట్ ఆన్ లో ఉన్నా, లేకున్నా ఆప్ పనిచేస్తుంది.

మీరొక పదం టైప్ చేయగానే, దాని అర్థాలు, పర్యాయపదాలు, దాని వాడకం, ఆ పదం యొక్క పుట్టుక, దాన్ని ఎలా పలకాలో చెప్పే ఫోనెటిక్ సౌండ్, పదాన్ని మొదట ఎప్పుడు వాడారో .ఇలా మీకు కావాల్సినదాని కన్నా ఎక్కువ సమాచారమే మీ ముందు ఉంచుతుంది ఈ ఆప్.ఇక ఏమాత్రం అలస్యం చేయకుండా డౌన్లోడ్ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube