శరీరాన్ని ప్రేమించమంటోంది

అందాల బొమ్మలి మరో రెండు రోజుల్లో మన మధ్యకు రాబోతోంది.సైజ్ జీరో సినిమాలో అనుష్క ఎంత భారిగా ఉందొ , అంతకంటే భారి రిలీజ్ ప్లాన్ చేసారు సినిమా కోసం.

 Mental Fitness Is Important – Anushka-TeluguStop.com

అధిక బరువుతో బాధపడే అమ్మాయిగా ఇందులో నటించిన అనుష్క, మన శరీరం ఎలా ఉన్నా దాన్ని ప్రేమించమంటోంది.

సైజ్ జీరో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన అనుష్క ” ఫిట్ నేస్ అనేది కేవలం శరీరానికే అనుకోను, మానసికంగా ఫిట్ గా ఉండటమే అసలైన ఫిట్నెస్.

తమ శరీరం ఇలా ఉంది, అలా ఉంది అని తెగ బాధపడిపోతూ ఉంటారు చాలా మంది.దాన్ని మార్చుకునేందుకు పడరాని పాట్లు పడుతూ ఉంటారు.

అది ఎంత మాత్ర సమంజసం కాదు.మన శరీరాన్ని మనం ప్రేమించాలి, దాన్ని గౌరావించాలి.

దానికి ఏది ఎంత అవసరమో చూసుకోవాలి.సైజ్ జీరో ద్వారా ఇదే మెసేజ్ ని ఇచ్చాం.

మరీ ముఖ్యంగా బరువు వలన చాల మంది అమ్మాయిలూ బాధపడుతూ ఉంటారు.సైజ్ జీరో అలాంటివారికి చాలా పనికొస్తుంది ” అంటూ చెప్పుకొచ్చింది అనుష్క.

అనుష్క కి ఆర్య జంటగా నటించిన సైజ్ జీరో కి ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు.సోనాల్ చౌహాన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది.

పీ.వి.పీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.బాహుబలి కోసం ఇంకో 8 కిలోల బరువు తగ్గాల్సి ఉన్న అనుష్క ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube