అబ్బాయిలకు/మగాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే, వారి గురించి వారి కన్నా అమ్మాయిలకే బాగా తెలుసు.అబ్బాయి – మగాడు కి మధ్య పురుష పురుగులు ఎప్పుడూ ఊహించలేని తేడాలు చెప్పారు అమ్మాయిలు.
ఆన్ లైన్ లేడీలు చెప్పుకొచ్చిన అభిప్రాయాలు మీకోసం.
అబ్బాయిలు టీషర్ట్స్ ఎక్కువ వేస్తారట.
హడావుడి ఎక్కువ.అవసరానికి మించి మాట్లాడటం వీళ్ళ అలవాటు.
ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి అనే మనస్తత్వం ఉంటుంది.ఎవరైనా పడిపోతారనే అతినమ్మకం.
వ్యక్తిక్వం కన్నా అందానికి పెద్దపీట.ఇలా ఉంటారంట అబ్బాయిలు.
అబ్బాయి దశని దాటి, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటే మగాడు.దీనికి వయసుతో సంబంధం లేదట.
సింపుల్ గా ఉండటం.మాటతోరుతో ఆకట్టుకోవడం.
వ్యక్తి పట్ల, వ్యక్తిత్వం పట్ల గౌరవం.జీవితాంతం ఒక తోడు కావాలి అనే ఆలోచన, అన్నిటికీ మించి బాధ్యత.
ఇవి మగాడి లక్షణాలని సెలవిచ్చారు అమ్మాయిలు.
కాబట్టి, మీసాలు రాగానే మగాడిలాగా ఫీల్ అయిపోకండి.