టీడీపీలోకి మ‌రో వైకాపా ఎంపీ

అవును! జ‌గ‌న్ పార్టీ వైకాపా నుంచి టీడీపీలోకి వెళ్లేందుకు ఇంకా ప‌లువురు ఆస‌క్తి చూపుతున్నారన‌డానికి నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి సాక్ష్యంగా నిలుస్తున్నారు! 2014 ఎన్నిక‌ల్లో వైకాపా త‌ర‌ఫున గెలుపొందిన మేక‌పాటి.ఆయ‌న సోద‌రుడు మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, కుమారుడు మేక‌పాటి గౌతం రెడ్డి స‌హా అంద‌రూ వైకాపాలో ఉండి నెల్లూరులో చ‌క్రం తిప్పుతున్నారు.

 Mekapati Chandra Sekhar Reddy To Join Tdp-TeluguStop.com

మొద‌ట్లో కాంగ్రెస్‌లో ఉన్న మేక‌పాటి.ఆ త‌ర్వాత జ‌గ‌న్ పంచ‌న చేరి.

ఎంపీ సీటు సాధించారు.ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.

ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ నిర్ణ‌యాల‌పై ఆయ‌న ప‌రోక్షంగా విభేదిస్తూ వ‌చ్చారు.

గ‌తంలో ప్ర‌ధాని మోడీని మేక‌పాటి పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డం వైకాపా వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇప్పుడు తాజాగా ఆయ‌న మ‌రోసారి జ‌గ‌న్ వైఖ‌రిపై గుస్సాగా ఉన్నార‌ని ఓ వ‌ర్గం చెబుతుంటే.లేదు ఆయ‌న ఏకంగా పార్టీ మారే మూడ్‌లో ఉన్నార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

ప్ర‌త్యేక హోదాపై గ‌ళం విప్పిన జ‌గ‌న్‌.అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఆందోళ‌న సృష్టించారు.

ఆ త‌ర్వాత దీనిపై టీడీపీని టార్గెట్ చేస్తూ.ఆయ‌న పోరు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న అవ‌స‌ర‌మైతే ప్ర‌త్యేక హోదా కోసం మా ఎంపీల‌తో రాజీనామా చేయిస్తాన‌ని చెప్పారు.ఎంపీలతో రాజీనామా చేయించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామ‌ని అన్నారు.

అయితే, జ‌గ‌న్.వ్యాఖ్య‌ల‌పై సొంతం పార్టీ వైకాపాలో పెద్ద దుమారం రేగింది.

ఎంపీల‌తో రాజీనామా చేయిస్తాన‌ని బ‌హిరంగంగా జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డంపై పార్టీ పార్ల‌మెంట‌రీ నేత‌గా ఉన్న మేక‌పాటి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.పైకి మాత్రం గంభీరంగా ఉన్నా.

క‌నీసం మాతో మాట మాత్రం కూడా సంప్ర‌దించ‌కుండానే జ‌గ‌న్ ఇలాంటి ప్ర‌క‌ట‌న ఎలా చేస్తాడ‌ని ఆయ‌న అన్నారు.ఇప్పుడు ఇదే విష‌యంలో తీవ్రంగా క‌ల‌త చెందిన ఆయ‌న ఏకంగా జ‌గ‌న్‌కి గుడ్‌బై చెప్పాల‌ని డిసైడ్ అయ్యాడ‌ని స‌మాచారం.

జ‌గ‌న్ పార్టీలో కొన‌సాగితే.ఏ క్ష‌ణాన రాజీనామా చేయ‌మంటాడో న‌నే టెన్ష‌న్ ఆయ‌న‌ను వెంటాడుతోంద‌ని స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే టీడీపీ సైకిల్ ఎక్కితే మ‌రో రెండున్న‌రేళ్ల పాటు ప్ర‌శాంతంగా ప‌నులు చేసుకోవ‌చ్చ‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ట‌! ఈ క్ర‌మంలో వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు, సోద‌రుడు స‌హా త‌న‌కు టికెట్లు ఇస్తామ‌ని హామీ ఇస్తే బాబు చెంత చేరేందుకు త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌ర‌మూ లేద‌ని ఆయ‌న ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చాడ‌ట‌.అయితే, నెల్లూరులో టీడీపీకి మంత్రి నారాయ‌ణ స‌హా కాంగ్రెస్ నుంచి వ‌చ్చి చేరిన ఆనం బ్ర‌ద‌ర్స్‌, టీడీపీ సీనియ‌ర్ నేత సోమిరెడ్డి ప‌రివారం .ఇలా చాలా మంది త‌మ్ముళ్లే ఉండే స‌రికి బాబు మేక‌పాటి ప్రెపోజ‌ల్‌ని పెండింగ్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది.మ‌రి రాబోయే ఫ్యూచ‌ర్‌లో మేక‌పాటి పొలిటిక‌ల్ వ్యూ ఎలా ఉంటుందో చూడాలి!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube