మెగాస్టార్ తరువాతే ఎవరైనా!

వయసు 61.సినిమాలు మానేసి 8-9 సంవత్సరాలు అవుతోంది.

 Megastar Chiranjeevi Still Remains The No.1-TeluguStop.com

ఈ గ్యాప్ లో ఆయన స్థాయికి తగ్గట్టుగా పరిస్థితులు లేవు.రాజకీయాల్లో ఓటమి.

కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ప్రజల్లో వ్యతిరేకత.రాజకీయంగా మన అభిప్రాయాలు, అభిరుచులు వేరైనా, ఒక్కసారి తెల్లబట్టల స్థానంలో రంగు బట్టలు తొడిగి, ముఖానికి రంగు వేసుకోని వస్తే మనం పడిచచ్చే మెగాస్టార్ ఆయన.

వినాయక్ చివరి సినిమా “అఖిల్” చాలా పెద్ద డిజాస్టార్.అలాంటి సమయంలో రిస్కీగా వినాయక్ ని వెనకేసుకోని వస్తున్నా, రెస్పాన్స్ లో మార్పు లేదు.

బయ్యర్లు ఊహించిన దానికన్నా ఎక్కువే పెడుతున్నారు.అదికూడా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ఖైదీ నం.150 పోటి పడబోతోందని, ఆ సినిమాకి టాక్ వస్తే ఇక్కడ థియేటర్లు అనుకున్న మొత్తంలో దొరక్కపోవచ్చని తెలిసి.అదీ మెగాస్టార్ రేంజ్.

థియేట్రికల్ బిజినెస్ 80 కోట్లు దాటుతోంది.అన్ని కలుపుకోని 100 కోట్లకు పైగా బిజినెస్.

బాహుబలిని మినహాయిస్తే, ఈతరం టాప్ స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల తరువాత 100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌ లెక్కలు చూపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.ఒప్పుకోక తప్పదు .మెగాస్టార్ తరువాతే ఎవరైనా! ఇక సంక్రాంతికి టాక్ సంపాదించుకోని, శ్రీమంతుడుని దాటేసి, ఎప్పుడో వదిలేసిన తన నెం.1 కూర్చీలో మళ్ళీ తానే కూర్చోవడమే మిగిలింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube