మెగాస్టార్ తరువాతే ఎవరైనా!-Megastar Chiranjeevi Still Remains The No.1 3 months

Baahubali Chiranjeevi Khaidi No.150 Megastar Chiranjeevi Still Remains The No.1 Pre Release Business Photo,Image,Pics-

వయసు 61. సినిమాలు మానేసి 8-9 సంవత్సరాలు అవుతోంది. ఈ గ్యాప్ లో ఆయన స్థాయికి తగ్గట్టుగా పరిస్థితులు లేవు. రాజకీయాల్లో ఓటమి. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ప్రజల్లో వ్యతిరేకత. రాజకీయంగా మన అభిప్రాయాలు, అభిరుచులు వేరైనా, ఒక్కసారి తెల్లబట్టల స్థానంలో రంగు బట్టలు తొడిగి, ముఖానికి రంగు వేసుకోని వస్తే మనం పడిచచ్చే మెగాస్టార్ ఆయన.

వినాయక్ చివరి సినిమా “అఖిల్” చాలా పెద్ద డిజాస్టార్. అలాంటి సమయంలో రిస్కీగా వినాయక్ ని వెనకేసుకోని వస్తున్నా, రెస్పాన్స్ లో మార్పు లేదు. బయ్యర్లు ఊహించిన దానికన్నా ఎక్కువే పెడుతున్నారు. అదికూడా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ఖైదీ నం.150 పోటి పడబోతోందని, ఆ సినిమాకి టాక్ వస్తే ఇక్కడ థియేటర్లు అనుకున్న మొత్తంలో దొరక్కపోవచ్చని తెలిసి. అదీ మెగాస్టార్ రేంజ్.

థియేట్రికల్ బిజినెస్ 80 కోట్లు దాటుతోంది. అన్ని కలుపుకోని 100 కోట్లకు పైగా బిజినెస్. బాహుబలిని మినహాయిస్తే, ఈతరం టాప్ స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల తరువాత 100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌ లెక్కలు చూపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఒప్పుకోక తప్పదు .. మెగాస్టార్ తరువాతే ఎవరైనా! ఇక సంక్రాంతికి టాక్ సంపాదించుకోని, శ్రీమంతుడుని దాటేసి, ఎప్పుడో వదిలేసిన తన నెం.1 కూర్చీలో మళ్ళీ తానే కూర్చోవడమే మిగిలింది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. అ హీరోతో పిల్లల్ని కన్నట్టు ఊహించుకునే దీపిక
ira

About This Post..మెగాస్టార్ తరువాతే ఎవరైనా!

This Post provides detail information about మెగాస్టార్ తరువాతే ఎవరైనా! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Megastar Chiranjeevi still remains the No.1, Chiranjeevi, Khaidi No.150, 100Crores, Baahubali, Pre Release Business

Tagged with:Megastar Chiranjeevi still remains the No.1, Chiranjeevi, Khaidi No.150, 100Crores, Baahubali, Pre Release Business100crores,baahubali,chiranjeevi,Khaidi No.150,Megastar Chiranjeevi still remains the No.1,pre release business,,