ఏడు పదుల వయసులోనూ... నీకు సాటి మరెవ్వరూ లేరు

తెలుగు సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి( Chiranjeevi ) అంటే తెలుగు సినిమా అన్నట్లుగా పరిస్థితి మారింది అంటే ఏ స్థాయిలో చిరంజీవి తెలుగు సినిమాను శాశించారో అర్థం చేసుకోవచ్చు.దాదాపుగా మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్‌ లో ఏకచత్రాదిపత్యం ను కొనసాగించిన చిరంజీవి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు.

 Megastar Chiranjeevi Birthday Special Story , Chiranjeevi , Chiranjeevi Birthday-TeluguStop.com

అక్కడ పదేళ్లు ఉన్న తర్వాత సినిమాల్లోకి రావాలి అనుకున్నారు.రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవికి ఇంకా సినిమా ఇండస్ట్రీ లో ఆధరణ లభిస్తుందా.

అభిమానులు ఆయన్ను పట్టించుకుంటారా అని అంతా భావించారు.కానీ ఖైదీ నెం.150 సినిమా తో అద్భుతమైన రీ ఎంట్రీ లభించింది.ఇలాంటి ఒక రీ ఎంట్రీ ఏ హీరోకు దక్కలేదు అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు కూడా షాక్‌ అయ్యారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Khaidi, Fans, Tollywood-Movie

ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.తాజాగా చిరంజీవి ఏడు పదుల వయసుకు చేరువ అవుతున్నాడు.అయినా కూడా ఈ వయసులో కూడా ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేసుకుంటూ వెళ్తున్నాడు.

ఈ ఏడాది రెండు సినిమాలు వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ లతో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది ఒక రీమేక్ మరియు ఒక డైరెక్ట్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Khaidi, Fans, Tollywood-Movie

ఆ రెండు సినిమాలకు సంబంధించిన హడావుడి ఇప్పటికే ప్రారంభం అయింది.హీరోగా చిరంజీవి జోరు కంటిన్యూ అవుతూనే ఉంది.సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌ ఆయన స్థాయిని నిర్ణయించలేవు అనడంలో సందేహం లేదు అంటూ చాలా సందర్భాల్లో నిరూపితం అయింది.తాజాగా మరోసారి భోళా శంకర్‌ సినిమా( Bhola Shankar ) ఫ్లాప్ అయినా కూడా భారీ వసూళ్లు రావడంతో అంతా కూడా షాక్‌ అవుతున్నారు.

నేడు మెగాస్టార్‌ పుట్టిన రోజు( Chiranjeevi birthday ).ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌ అంతా కూడా పండుగ చేసుకుంటున్నారు.మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద రోజు.మెగాస్టార్‌ చిరంజీవికి మా తరపున మీ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube