మెగాఆర్‌సి9 టీజర్‌ టాక్‌

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తాజా చిత్రం టీజర్‌ చిరు పుట్టిన రోజు సందర్బంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.చాలా రోజులుగా ఈ టీజర్‌ కోసం మెగా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Mega Rc9 Teaser Talk-TeluguStop.com

శ్రీనువైట్ల దర్శకత్వంలో దానయ్య నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది.పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక తాజాగా విడుదలైన టీజర్‌ మెగా ఫ్యాన్స్‌ను పూర్తి స్థాయిలో సంతృప్తి పర్చలేక పోయింది.అందుకు మెయిన్‌ కారణం ఈ సినిమాకు టైటిల్‌ ఫిక్స్‌ చేయకుండానే టీజర్‌ విడుదల చేయడం.

టైటిల్‌ ఫిక్స్‌ చేసి ఉంటే బాగుండేదని మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.టీజర్‌ కేవలం 40 సెకన్లు మాత్రమే ఉండటంతో మరి కొద్ది సమయం ఉంటే బాగుండనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

ఇక ట్రైలర్‌లో చిరంజీవిని కూడా చూపించి ఉండాల్సిందని అంటున్నారు.ఈ సినిమాలో చిరు గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా చరణ్‌ నటిస్తున్న 9వ సినిమా అవ్వడంతో ఆర్‌సి9 అంటూ ఈ సినిమాను పిలుస్తున్నారు.రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube