‘బ్రూస్‌లీ’గా రామ్‌చరణ్‌!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే.‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత చరణ్‌ నటిస్తున్న ఈ సినిమపై ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

 Mega Hero’s Next Is Bruce Lee-TeluguStop.com

ఆ అంచనాలను అందుకునేందుకు దర్శకుడు శ్రీనువైట్ల ఎంతో కష్టపడుతున్నాడు.పక్కా స్క్రిప్ట్‌ను రెడీ చేసి పక్కా షెడ్యూల్స్‌తో షూటింగ్‌ను జరుపుతున్న శ్రీనువైట్ల ఈ సినిమాకు టైటిల్‌గా ‘బ్రూస్‌ లీ’ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

నిన్న మొన్నటి వరకు ఈ సినిమాకు ‘నా పేరు రాజు’ను పరిశీలించినట్లుగా వార్తలు వచ్చాయి.అయితే కథానుసారం ‘బ్రూస్‌ లీ’ అనే టైటిల్‌ సరిగ్గా సూట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఫైట్‌ మాస్టర్‌గా కనిపించనున్నాడు.చిన్నప్పటి నుండి కూడా బ్రూస్‌లీని ఆదర్శంగా తీసుకుని మరీ ఫైట్‌ మాస్టర్‌గా హీరో ఎదుగుతాడు.

చరణ్‌ ఈ సినిమాలో బ్రూస్‌ లీకి వీరాభిమానిగా కనిపిస్తాడు.అందుకే ఈ సినిమాకు కరెక్ట్‌ టైటిల్‌ ‘బ్రూస్‌ లీ’ అని నిర్ణయించుకున్నారు.

అతి త్వరలో ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా లక్కీ గర్ల్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనే పట్టుదలతో ఈ సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube