కోన‌వెంక‌ట్‌పై మెగాహీరో గుర్రు....

టాలీవుడ్ స్టార్ రైట‌ర్‌గా ఇమేజ్ తెచ్చుకున్న కోన‌వెంక‌ట్ ఇప్పుడు గ‌డ్డుకాలం ఫేస్ చేస్తున్నాడు.కోన‌వెంక‌ట్ రైట‌ర్‌గా వ‌ర్క్ చేసిన భారీ చిత్రాలు బ్రూస్ లీ, అఖిల్‌లు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యాన్ని మూట గ‌ట్టుకున్నాయి.

 Mega Hero Angry On Kona Venkat..?-TeluguStop.com

స‌క్సెస్ వ‌చ్చిన‌ప్పుడు ఒక‌లా, ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు ఒక‌లా మాట్లాడ‌టం త‌న‌కు కూడా వ‌చ్చున‌ని కోన నిరూపించుకునే ప్ర‌య‌త్నం బాగానే చేస్తున్నాడు.ఎందుకంటే బ్రూస్‌లీ ప‌రాజ‌యం త‌ర్వాత మెగాక్యాంప్ సినిమా గురించి ఏమీ మాట్లాడ‌టం లేదు.

కానీ కోన‌వెంక‌ట్ మాత్రం ఆ సినిమాపై నోరు విప్పాడు.అస‌లు త‌ను రాసిన సీన్స్‌ను డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల అలాగే తీసుకోలేద‌ని చాలా మార్పులు చేశాడ‌ని చెప్పుకొచ్చాడు.

ఓ ర‌కంగా చెప్పాలంటే త‌నకు అనుకున్న స్థాయిలో రెస్పెక్ట్ ఇవ్వ‌లేద‌నే భావ‌న‌తో అలా చెప్పాడా అనిపిస్తుంది.

సినిమా షూటింగ్ స‌మ‌యంలో, రిలీజ్ స‌మ‌యంలో గుర్తుకు రానీ ఇలాంటి విష‌యాలు సినిమా ప్లాప్ కావ‌డంతో గుర్తుకు రావ‌డం ఆ విష‌యంపై రాద్ధాంతం చేయ‌డం స‌రికాద‌ని, సినిమా అప‌జ‌యం గురించి కోన ఎక్కువ‌గా మాట్లాడుతున్నాడ‌ని రీసెంట్‌గా సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ మెగా క్యాంప్‌కు చెందిన హీరో త‌న మిత్రుల ద‌గ్గ‌ర వాపోయాడ‌ట‌.

ఇలాగే ఉంటే కోన మెగాక్యాంప్ కు దూరం కావడం ఖాయంగా కనిపిస్తుంది.అందుకు కార‌ణం కూడా ఉంది.సినిమా రిలీజ్‌కు ముందు ఒక‌లా, రిలీజ్ త‌ర్వాత మ‌రోలా మాట్లాడ‌టం స‌రికాద‌నే విష‌యం కోన మ‌ర‌చిపోయినట్టున్నాడు.సరే తను నిర్మాతగా ఏం చేస్తున్నాడు.

రీమేక్ సినిమాలు చేస్తున్నాడు.తన సినిమా స్టామినా ఏంటో డిసెంబర్ 4న రిలీజ్ కానున్న శంకరాభరణంతో తేలిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube