చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.దాంతో జూన్ 6వ తేదీన సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఈ సినిమా టీమ్ చెబుతోంది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.చిరంజీవి 150వ సినిమా తమిళ మూవీ ‘కత్తి’కి రీమేక్ అనే విషయం తెలిసిందే.
చిరంజీవి ఇమేజ్ కి తగిన విధంగా కథలో కొన్ని మార్పులు చేశారు.
ఈ సినిమాకి ‘కత్తిలాంటోడు’ టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
కథానాయికగా అనుష్కను ఫైనల్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.చిరంజీవి 150వ సినిమాకి గల ప్రాముఖ్యతను .అభిమానులు చిరంజీవి సినిమా నుంచి ఆశించే అంశాలను దృష్టిలో పెట్టుకుని వినాయక్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.
సంక్రాంతి కానుకగా ఈ సినిమాను అందించాలనే ఆలోచనలో వున్నారు.ఇక ఈ సినిమాలో ఎలాంటి విశేషాలు చోటుచేసుకుంటాయో చూడాలి.